V1News Telangana

best news portal development company in india

మహేశ్వరం గురుకులంలో మెరిసిన ఇంటర్ మెరికలు

SHARE:

హైదరాబాద్, ఏప్రిల్27,వి1న్యూస్; మహేశ్వరం సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఫలితాలు ఈ నెల 24 వ తేదీన వెలువడ్డాయి.

ఆ ఫలితాల్లో మొదటి సంవత్సరం 82.5%, ద్వితీయ సంవత్సరం 100% ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఈమని శ్రీలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి సంవత్సరం ఎం పి సి 40, బి పి సి 40 మంది పరీక్ష రాయగా 66 మంది ఉత్తీర్ణత సాధించారు. ఎం పి సి లో కె. అమృత 500/445 మార్కులు సాధించి కళాశాల మొదటి స్థానం, ఎం. దీక్షిత 500/441, బి పి సి లో ఎం. కావ్యాంజలి 500/432, స్పందన 500/425 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరం ఎం పి సి 73 మంది పరీక్ష రాయగా 73 మంది ఉత్తీర్ణులయ్యారు.ఈ రంగారెడ్డి ఈస్ట్ రీజిన్లో 100 % సాధించిన ఘనత మాదే అని సగర్వoగా చెప్పారు. సి హెచ్. సంజన 1000/980 మార్కులు సాధించి కళాశాల టాప్పర్ గా నిలిచింది. జి.హారిక 976 మార్కులు సాధించి రెండవ స్థానంలో నిలిచింది. బి పి సి లో పి. స్వర్నాంజలి 974, ఎం. నవనీత 936 మార్కులు సాధించారు. అలాగే మొన్న వెలువడ్డ జె యి యి మైన్సలో 5 మంది విద్యార్థినులు అడ్వాన్స్ పరీక్ష రాయడానికి అర్హత సంపాదించారని చెప్పడానికి చాలా గర్వపడుతున్నానని శ్రీలక్ష్మి హర్షాతిరేకలు వ్యక్తం చేశారు. ఇంతటి గొప్ప ఫలితాలు రావడానికి నిరంతరం ఉపాధ్యాయుల ప్రోత్సాహం. విద్యార్థుల కృషి, పట్టుదల ఎంతో ఉందని చెప్పారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india