కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండల కేంద్రం నుండి లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ శెట్ కార్ కు మద్దతుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో శంకరంపేటలో నిర్వహించే జన జాతర ,భారీ బహిరంగ సభకు విచ్చేయాలని బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి పిలుపు మేరకు మండల పరిధిలోని ముఖ్య నాయకులు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నసురుల్లాబాద్ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ (నందు) రెడ్డి, కార్యదర్శి శివప్రసాద్, మండల మైనార్టీ అధ్యక్షుడు యూసుఫ్, పార్టీ గ్రామ అధ్యక్షుడు అయినాల లింగం, గ్రామ మాజీ సర్పంచ్ అరిగె సాయిలు, మాజీ ఎంపిటిసి శంకర్ నాయక్, బొమ్మందేవ్ పల్లి మాజీ సర్పంచ్ అన్నం సత్యనారాయణ, మైలారం గ్రామ అధ్యక్షుడు మహేందర్ గౌడ్ , కార్యదర్శి సంకూరి రవి, అయినాల లచ్చయ్య, ఫయాజ్, కొరిపల్లి పోచయ్య వివిధ గ్రామాల ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








