V1News Telangana

best news portal development company in india

ట్రాక్టర్లతో అక్రమ ఇసుక రవాణా… మంజీరా నది నుండి కొనసాగుతున్న దో నెంబర్ దందా…

SHARE:

బోధన్ మండల కేంద్రంలోని ఖాజపూర్,పెంట గ్రామాల మీద నుండి రాత్రి పగలు ట్రాక్టర్లతో ఇసుక రవాణా జరుపుతున్నారు. ఇష్టానుసారం అక్రమంగా ఇసుక దొంగలిస్తున్న సంబంధిత శాఖ అధికారులు అటువైపు చూడకపోవడం సిగ్గుచేటని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. సాలూర మరియు బోధన్ రెండు మండలాల మధ్యలో నుండి అక్రమంగా ట్రాక్టర్లు ఇసుక నింపుకొని వెళ్తా ఉంటే రెండు మండలాలకు చెందిన రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని స్థానిక ప్రజల ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు అక్రమంగా దొంగలిస్తున్న ఇసుక రవాణాను పూర్తిస్థాయిలో నిలిపివేయాలని, ట్రాక్టర్ల పైన చర్యలు తీసుకొని వాహనాల యజమానులపై కేసు నమోదు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india