V1News Telangana

best news portal development company in india

మా పని పైసలు మాకివ్వండి సెక్రటరీ సారు గరిబోలము పరేషాన్ అవుతున్నాము…… మా ఊర్ల అంబం గ్రామ ప్రజలతో ఉపాధి హామీ పనులు చేయించడం న్యాయమా….?

SHARE:

రుద్రూర్ మండల కేంద్రం లోని అక్బర్నగర్ గ్రామం లో ఉపాదిహామీ పని చేయడానికి వెళ్లిన 30 మంది కూలీల పైసలు రాలేదని డబ్బులు ఎందుకివ్వడం లేదని అధికారి నీ ప్రశ్నించగా తమకు పనులకు రావద్దని గ్రామ సెక్రటరీ దురుసుగా మాట్లాడుతున్నాడని ఉపాధిహమి కూలీలు తెలిపారు.4 వారలు పని చేసిన డబ్బులు ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏంటని పని చేసే దాకా పొట్ట నిండని బ్రతుకులు మావంటూ కూలీలు నిరాశ చెందుతున్నారు. అక్బర్నగర్ సెక్రటరీ ఉపాధిహమి పనులకు వెళ్లిన వారి డబ్బులు ఇవ్వకపోతే తము ప్రభుత్వ కార్యాలయ ఎదుట ధర్నాలు నిర్వహిస్తామని స్పష్టంగా తెలిపారు. అక్బర్నగర్ గ్రామం లో అంబం ప్రజలను తీసుకొచ్చి ఉపాధిహామీ పనులు చేయించడం ఎంత వరకు న్యాయమని పై స్థాయి అధికారులు విచారణ జరిపి తమ డబ్బులు తమకు ఇప్పియాలని అక్బర్నగర్ ఉపాధిహమి కూలీలు కోరుతున్నారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india