V1News Telangana

best news portal development company in india

చలివేంద్రాన్ని ప్రారంభించిన తహసిల్దార్….

SHARE:

  1. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో వేసవికాలం కావడం వల్ల రోజు రోజుకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజల దాహార్తిని తీర్చడానికి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని తహసిల్దార్ లత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవికాలంలో ప్రజలు పనుల నిమిత్తం ప్రయాణాలు చేసి అలసిపోయి దాహాన్ని తీర్చుకోవడానికి గ్రామపంచాయతీ కార్యాలయం వారు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం అన్నారు. ఇలాగే ప్రజలందరూ సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గంగారం, సిబ్బంది ప్రకాష్, హన్మంత్, ప్రవీణ్ ,సాయి తదితరులు పాల్గొన్నారు.
Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india