V1News Telangana

best news portal development company in india

అనుమతులు లేకుండా అడ్మిషన్లు… కళాశాలకు తాళం*

SHARE:

నిజామాబాద్ జిల్లా:ప్రతినిధి .జిల్లా:ఏప్రిల్ 20

ఎలాంటి అనుమతి లేకుం డా అడ్మిషన్లు నిర్వహిస్తున్న అల్ ఫోర్స్ కళాశాలను విద్యా శాఖ అధికారి రవికుమార్ శనివారం తాళం వేశారు.
నిబంధనలకు విరుద్ధంగా ఆల్ ఫోర్స్ కళాశాల పేరుతో ప్రచారాల ఫ్లెక్సీలు తొలగిం చారు. అనంతరం కళాశాల అడ్మిషన్ తీసుకుంటున్న బాధ్యులతో డిఐఈఓ మాట్లాడుతూ….అనుమతి లేకుండా అడ్మిషన్లు తీసు కుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
గత ఆరు నెలలుగా ఎలాం టి అనుమతులు లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తున్నా రని విద్యార్థి సంఘాల నేతల ఆందోళనలు, మీడియాలో ఫిర్యాదులు రావడంతో విద్యాశాఖ ఈ చర్య తీసుకుంది.
నగరంలోని నాలుగు ప్రాంతాల్లో బ్రాంచీలను ఏర్పాటు చేసిన ఆల్ ఫోర్స్ కాలేజీ… తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్ ప్రాంతంలో సొంత భవనాన్ని కూడా నిర్మించుకుని ఎలాంటి బోర్డు, అనుమ తులు లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తోంది.
*విశ్వశాంతి కళాశాల అనుమతులు రద్దు చేయాలి…*
నిజామాబాద్ నగరంలోని విశ్వశాంతి కాలేజీ సెంటర్ లో… ఆల్ ఫోర్స్ కాలేజీ అంటూ ప్రచారాలు నిర్వహించి ఎలాంటి అనుమతులు లేకుండా అడ్మిషన్లు చేస్తున్నారు.
విశ్వశాంతి కళాశాలపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. ఆ కాలేజీ గుర్తింపు రద్దు చేయా లని కోరుతూ అఖిల భారత విద్యార్థి సంఘం జిల్లా కమిటీ కార్యదర్శి జ్వాల ఆధ్వర్యంలో జిల్లా ఇంటర్మీడియట్ విభాగం అధికారికి వినతిపత్రం అందజేశారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india