V1News Telangana

best news portal development company in india

బీర్కూర్ మండల కేంద్రంలో సర్వసభ్య సమావేశం….

SHARE:

V1 న్యూస్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం రోజు MPP తిలకేశ్వరి రఘు మరియు ఇన్చార్జి MPO భాను ప్రకాష్ అధ్యక్షతన వివిధ అంశాలపై ,సమస్యలపై చర్చల గురించి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వివిధ శాఖల అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ప్రధానంగా వేసవిలో ఏర్పడే నీటి ఎద్దడి, పారిశుద్ధ్యం గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు సమస్యల పరిష్కారం గురించి చర్చించారు. గత కొద్ది రోజుల క్రితం నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోయి చాలా ఇబ్బందులకు గురైనప్పటికీ ఇప్పటివరకు కంపెనీ వారు స్పందించకపోవడం బాధాకరమన్నారు. అధికారులు సదరు కంపెనీతో చర్చలు జరిపి రైతులకు నష్టపరిహారం ఇప్పించి సరైన న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india