V1News Telangana

best news portal development company in india

మానవత్వాన్ని చాటుకున్న ఏనుగు రవీందర్ రెడ్డి….

SHARE:

V 1 న్యూస్ ప్రతినిధి:
బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు కార్యక్రమాలలో పాల్గొనడానికి నిజామాబాద్ వైపు వెళుతుండగా ఇద్దరు కూలీలు తమ పనిని ముగించుకొని మోస్ర నుండి వర్ని వైపు ప్రయాణించే సందర్భంలో గోవూరు ప్రయాణ ప్రాంగణం వద్ద ద్విచక్ర వాహనంపై నుండి కింద పడిపోయిన సంఘటన అటువైపుగా వెళ్తున్న ఆయన గమనించారు. మానవతా దృక్పథంతో వెంటనే ఆయన స్పందించి 108 అంబులెన్స్ కి సమాచారం అందించి బాధితులను నిజామాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితుల కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్నిచ్చి మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంలో ఆయన వెంట కార్యకర్తలు నాయకులు తదితరులు ఉన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india