కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా గురువారం రోజు తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో సీతారాముల ఉత్సవ విగ్రహాలతో రథోత్సవాన్ని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా అంగరంగ వైభవంగా నిర్వహించారు. హనుమాన్ మాలాధారణ స్వాములు ,ప్రజలు భక్తిశ్రద్ధలతో కళ్యాణ రామున్ని నామ స్మరణలతో వేడుకున్నారు. పురుషులతో పాటు స్త్రీలు కూడా మేము సైతం సీతారాముల రథోత్సవంలో భాగస్వాములమవుతామని ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ ప్రజలు డీజే మరియు డప్పుల చప్పుల్ల తో రామనామ స్మరణలు చేసుకుంటూ ఆటపాటలతో ఆనందోత్సాహాలతో మైమరచిపోయి రథోత్సవ ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. సీతారాముల అనుగ్రహంతో దేశంలోని ప్రజలు మరియు గ్రామ ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ అరిగె నారాయణ, కార్యదర్శి గుత్తుల శ్రీనివాస్ ,మాజీ సర్పంచ్ అరిగె సాయిలు, మాజీ ఎంపీటీసీ ,గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కంది మల్లేష్ , గ్రామ అభివృద్ధి కమిటీ కార్యదర్శి బోధనం సాయిలు, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు అయినాల లింగం, బి.ఆర్.ఎస్ పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షుడు బొడిగె భాను ప్రకాష్ గౌడ్, యువభారత్ యూత్ అధ్యక్షుడు గొడిసెల చంద్రశేఖర్ గౌడ్, రామకృష్ణారెడ్డి , గొడిసెల నర్సింలు గౌడ్, మైశాగౌడ్ , అనుసూరి శ్రీనివాస్, కూని మహేందర్ గౌడ్ గ్రామ ప్రజలు మరియు యువకులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








