కామారెడ్డి జిల్లా బీర్కూర్: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ ఎంపీ ఎన్నికల్లో సైనికుల్లా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ కమిటీలకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే పార్లమెంటు జహీరాబాద్ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలి అన్నారు. ప్రతి కార్యకర్త బూత్ స్థాయి లో గల ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాల అమలును వివరించాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని దేశంలో సైతం అధికారంలోనికి వస్తే రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








