V1News Telangana

best news portal development company in india

తల్లిపాలు తాగి రొమ్ము కోసినట్లు వెన్నుపోటు పొడిచారు…..

SHARE:

బాన్సువాడ (కామారెడ్డి),
నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల శ్రీ వెంకట సాయి విద్యానికేతన్ పాఠశాల ఆవరణలో నసురుల్లాబాద్ ,బీర్కూర్ ఉభయ మండలాల పార్లమెంట్ ఎన్నికల విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బి.ఆర్.ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి పోచారం భాస్కర్ రెడ్డి , రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు డి .అంజిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు .ఈ సందర్భంగా శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలల సమయం గడుస్తున్న వారు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు అన్నారు. సంక్షేమ పథకాలను అమలు చేయడంలో పూర్తిస్థాయిలో విఫలమైందని ఎద్దేవా చేశారు. కొంతమంది కార్యకర్తలు మా వెన్నంటి ఉండి పదవులు ఆస్తులు సంపాదించుకొని ఈరోజు తల్లి పాలు తాగి రొమ్ముకోసినట్టు వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయారన్నారు. చెత్త నాయకులు వెళ్లిపోయారని మిగిలినవారు కడిగిన ముత్యాల్లాగా నికార్సుగా మా నాయకత్వాన్ని పార్టీని బలోపేతం చేయడానికి ఉన్నారన్నారు. నా తదనంతరం రాజకీయ పరంపర ప్రజలకు సేవలు కొనసాగాలని వారసుడిగా భాస్కర్ రెడ్డిని నియమించానని తెలిపారు. మమ్మల్ని నమ్ముకున్న వారిని కాపాడుకోవడానికి నాకంటే మెరుగ్గా నా నియోజకవర్గ ప్రజలకు సేవలందించడానికి యువ నాయకుడు మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాడని తెలిపారు. పక్క నియోజకవర్గంలో ప్రజలు తరిమేసిన నాయకుడు మన నియోజకవర్గంలో ప్రగల్బాలు పలుకుతున్నాడన్నారు. రాబోయే లోకసభ ఎన్నికల్లో నాయకులు కార్యకర్తలు అందరూ సమన్వయంతో క్షేత్రస్థాయిలో అధికార పార్టీ వైఫల్యాలను వారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైన విషయాలను ప్రజలకు తెలియజేస్తే చాలు, మన పార్టీ ఎంపీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని కేసీఆర్ గారికి బహుమానంగా ఇవ్వవచ్చు అని సూచించారు. ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలవుతాయని సూచించారు, మనకు మళ్లీ మంచి రోజులు వస్తాయని నన్ను మోసం చేసిన వారికి తగిన గుణపాఠం చెబుతాను అని అన్నారు. నాపై అభిమానంతో నమ్మకంతో ఉన్న నాయకులను కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకుంటానని వారి పాదాలు కడిగి తలపై నీళ్లు చల్లుకుంటానని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ నసురుల్లాబాద్ మండల అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, ఎంపీపీ పాల్త్యా విట్టల్, బీర్కూర్ నాయకులు శశికాంత్ ఇక ప్రజా ప్రతినిధులు నాయకులు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india