V1News Telangana

best news portal development company in india

హనుమాన్ స్వాములకు మండల భిక్ష ( ప్రసాదం) ఏర్పాటు…..

SHARE:

బాన్సువాడ (కామారెడ్డి),

బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామంలో గల హనుమాన్ మందిరంలో శనివారం అంగీర్గ పద్మ,దుబాయ్ విట్టల్ గౌడ్ దంపతుల పెద్ద కుమారుడు అంగీర్గ సంజీవ్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ అభిషేకం ఆంజనేయ స్వామి వారికి అభిషేకం మరియు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ మాలధారణ స్వాములకు మండల భిక్ష (ప్రసాదం) ఏర్పాటు చేశారు . మండలంలోని వివిధ గ్రామాల నుండి మాలదారణ స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వాములు భక్తితో పూజా కార్యక్రమాలు నిర్వహించి , రామ మంత్రం, భజనలు ,పాటలతో స్వామి వారికీ నైవేద్యం సమర్పించి భిక్షను స్వీకరిచారు.భిక్ష అనంతరం స్వాములకు తాంబూలం సమర్పించారు. ఆయా గ్రామాల హనుమాన్ గురు స్వాములకు శాలువాలతో ఘనంగా సత్కరించారు, వారు మాట్లాడుతూ ఎల్లప్పుడూ అందరూ ఇదేవిధంగా స్వామివారి మాలాధారణం స్వీకరించి సన్మార్గంలో నడవాలని సూచించ దాతల కుటుంబ సభ్యులకు ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ హనుమాన్ స్వాములు ఆశీర్వదించారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india