V1News Telangana

best news portal development company in india

జన్మదిన వేడుకలో రక్తదాన శిబిరం…..

SHARE:

కామారెడ్డి జిల్లా,
బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని రామాలయం ప్రాంగణంలో కేక్ కటింగ్ మరియు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో మండల నాయకులు ,కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొని తమ ప్రియతమ నాయకుడి జన్మదినం సందర్భంగా అందరూ స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమం బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో జరిగింది. సమావేశానికి మండల అధ్యక్షుడు నందు రెడ్డి నాయకత్వం వహించారు. ఆయన మాట్లాడుతూ స్వచ్ఛందంగా రక్తదానం చేసిన వారిని అభినందించారు, ప్రభుత్వాసుపత్రి వైద్యులు సాకేత్ వర్మ (MBBS),B. శ్రీనివాస్ మాట్లాడుతూ నసురుల్లాబాద్ మండల యువకులు రక్తదానం చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు , భవిష్యత్తులో ఇలాగే అందరూ యువకులు సంఘటితంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు శివప్రసాద్, యూసుఫ్, అరిగేసాయిలు, మంతపురి సాయ గౌడ్, రామకృష్ణారెడ్డి ,అయినాల లింగం, భాస్కర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి ,నరేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india