గత సంవత్సరం తక్కువ వర్షపాతం నమోదు కావడంతో ఈ సంవత్సరం వేసవికాలం ప్రారంభం నుండే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ సందర్భంగా వైద్యశాఖ అధికారులు ప్రజలకు ఎండల తీవ్రత నుండి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సూచనలు చేశారు. ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు తలపై తెలుపు రంగు కాటన్ వస్త్రాలు లేదా టోపీలు లేదా గొడుగు వంటి వాటిని ఉపయోగించాలని మరియు వేసవికాలంలో అధికంగా ద్రవపదార్థాలు సేవించాలని ఉదాహరణకు మంచినీరు, పళ్ళ రసాలు, రాగి జావా, అంబలి , కొబ్బరినీళ్లు, మజ్జిగ, గ్లూకాన్ డి , ఓ ఆర్ ఎస్ వంటివి సేవించాలని తెలిపారు. తేనె వంటి తీపి పదార్థాలు మరియు శీతల పానీయాలకు ప్రజలు దూరంగా ఉండాలన్నారు, మిట్ట మధ్యాహ్నం సమయంలో ఎక్కువగా శారీరక శ్రమను పెంచే పనులు చేయకూడదని ఎక్కువసేపు ఎండలో ఉండకూడదని సూచించారు. జ్వరం ,తల తిరగడం, వాంతులు వికారం, విరోచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే వడదెబ్బగా గుర్తించి వెంటనే వైద్యున్ని సంప్రదించాలి అని తెలియజేశారు. పైన తెలిపిన సూచనలను ఎవరైనా నిర్లక్ష్యం చేసిన యడల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








