V1News Telangana

best news portal development company in india

కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి సమావేశం

SHARE:

నసురుల్లాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నందు రెడ్డి అధ్యక్షతన మండల పరిధిలో గల వివిధ గ్రామాల కార్యవర్గ కమిటీ సభ్యులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు రాబోయే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ , మల్లికార్జున ఖర్గే , రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య నేతల నేతృత్వంలో 6వ తేదీ శనివారం నాడు తుక్కుగూడలో జరగబోయే భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరియు ఐదవ తేదీ శుక్రవారం రోజు మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకల సందర్భంగా మండల కేంద్రంలో ఆయన పేరిట గుడిలో అర్చన కార్యక్రమాలు, కార్యకర్తల అందరి అభిప్రాయంతో రక్తదాన శిబిరం మరియు కేక్ కటింగ్ కార్యక్రమాల గురించి చర్చించారు మరియు 07 తేదీ ఆదివారం రోజు బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలో స్థానిక ఫంక్షన్ హాల్ లో జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి కూడా అధిక సంఖ్యలో నాయకులు, ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మొదలగు అంశాల గురించి సమావేశంలో చర్చించుకోవడం జరిగింది ఇట్టి సమావేశం మండల అధ్యక్షుడు నందు రెడ్డి, కార్యదర్శి శివప్రసాద్,అరిగే సాయిలు, మంతపురి సాయగౌడ్, అయినాల లింగం, మైనారిటీ విభాగం మండల అధ్యక్షులు యూసుఫ్ , బోధనం సాయిలు, దుర్కి PACS చైర్మన్ దివిటి శ్రీనివాస్ యాదవ్, మాజీ ZPTC కిషోర్ యాదవ్ సమక్షంలో నిర్వహించబడింది.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india