కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నసురుల్లాబాద్ మండల పరిధిలో గల గ్రామాలు బొమ్మందేవ్ పల్లి నుండి హాజీపూర్ వరకు బీటీ రోడ్డు నిర్మాణము చేపట్టుటకు గత ప్రభుత్వ హయాంలో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నిధులు కేటాయించబడ్డాయి. రోడ్డు అంచనా విలువ రూపాయలు ఒక్క కోటి 75 లక్షలు. తేదీ 21 -9-2023 నాడు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది .శంకుస్థాపన జరిగి నేటికీ ఆరు నెలల 13 రోజులు గడిచిపోయినప్పటికీ రోడ్డు నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు రోడ్డుపై దారి పొడవునా కంకర రాళ్లు పరిచి ఉండడం వల్ల వాహనాలు పంక్చర్ కు గురికావడం మరియు బైక్ లపై ప్రయాణించే వారు కళ్ళల్లో దుమ్ము ధూళి పడడం వలన అదుపుతప్పి కింద పడిపోయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే దీనిపై స్పందించి సదరు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని రోడ్డు నిర్మాణాన్ని నాణ్యతగా, త్వరితగతిన పూర్తి చేయించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా రోడ్డు వినియోగంలోకి వచ్చే విధంగా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








