నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని కారం గిర్ని వద్ద సోమవారం అర్ధరాత్రి DCM వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నెమ్లి గ్రామానికి చెందిన పోచయ్య (34) గా గుర్తించారు ఆయన నసురుల్లాబాద్ నుండి కాలినడకన నెమ్లి వైపు వెళ్తుండగా ఉండగా నసురుల్లాబాద్ మీదుగా బాన్సువాడ వైపు వెళుతున్న DCM వాహనం వేగంగా ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. వర్ని మండల కేంద్రంలో గల వైన్స్ పర్మిట్ రూంలో తనతో పాటు పనిచేసేవాడని, గత మూడు రోజుల క్రితం వరకు బాగాపనిచేస్తూ ఉండేవాడని మూడు రోజులుగా అధికంగా మద్యం సేవిస్తూ సరిగ్గా పనికి రావడం లేదని అతని భార్య తెలిపింది విగతజీవిగా ఉన్న తన భర్తను చూసి భార్య రోదిస్తూ తమకు ఒక కుమారుడు ఉన్నాడు అని తెలిపింది . నిందితుడు వాహనం వదిలి పరారీలో ఉండడం వల్ల పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు అని ఎస్ఐ లావణ్య తెలియజేశారు, మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








