V1News Telangana

best news portal development company in india

ఘనంగా ముగిసిన పంచముఖ శివలింగ ప్రతిష్టాపన…..

SHARE:

ఘనంగా ముగిసిన పంచముఖ శివలింగ ప్రతిష్టాపన…..

నస్రుల్లాబాద్ మండలంలోని నెమ్లి గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో సోమవారం రోజు పంచముఖ శివలింగ ప్రతిష్టాపన కార్యక్రమం ముగిసింది. ఆలయ ధర్మకర్త పట్లోళ్ల మోహన్ రెడ్డి ,వైదిక వేద మార జ్యోతిష్య చండీ ఉపాసకులు గురురాజశర్మ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన ప్రత్యేక పూజలు మరియు లింగ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముగింపు వేడుకల్లో భాగంగా గణపతి పూజ ,యాగశాల స్థిత అవవాహిత దేవత ప్రాతఃకాల పూజ, మూల మంత్ర హోమములు, యంత్రస్థాపన , మూర్తిస్థాపన ,ప్రాణ ప్రతిష్ట అభిషేకం ,హోమము ,మహా పూర్ణాహుతి ,మహా హారతి, బ్రహ్మ కలశ విసర్జన ,వేద ఆశీర్వచనం, తీర్థప్రసాద వితరణ, కార్యక్రమా లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని నెమ్లి గ్రామంలో మోహన్ రెడ్డి లాంటి వారు జన్మించి ప్రజలకు ఆధ్యాత్మికత వైపు నడిపించడం గొప్ప విశేషం అన్నారు ఆ పరమేశ్వరుడి మరియు సాయినాధుడి అనుగ్రహం వల్ల ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. పట్లోళ్ల మోహన్ రెడ్డి అమెరికాలోని న్యూయార్క్ లో ఉంటూ కూడా తన స్వగ్రామాన్ని మరిచిపోకుండా గ్రామంలో ఆలయ నిర్మాణం చేపట్టడం మరియు మన తెలంగాణ ప్రాంతంలో చాలా అరుదుగా కనబడే పంచముఖ శివలింగాన్ని ప్రతిష్టించడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సెక్రటరీ వెంకటరామిరెడ్డి ట్రస్ట్ సభ్యులు నందురెడ్డి, పోతారెడ్డి ,సాయి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మరియు భక్తులు కూడా అధిక సంఖ్యలోపాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india