V1News Telangana

best news portal development company in india

నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధుల పలు శుభకార్యాలకు హాజరైన భాస్కర్ రెడ్డి

SHARE:

తేదీ 31 మార్చి 2024
బాన్సువాడ నియోజక వర్గం

నియోజక వర్గంలోని పార్టీ కార్యకర్తల యొక్క పలు శుభకార్యాలకు హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ డీసీసీబీ చైర్మన్,BRS పార్టీ రాష్ట్ర నాయకులు, బాన్సువాడ నియోజకవర్గ BRS పార్టీ ఇంచార్జి శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి..

కార్యక్రమంలో భాగంగా ముందుగా రుద్రూర్ మండల కేంద్రంలో గల శశిరేఖ గార్డెన్లో రాయికూర్ గోవిందరావు గారి మనుమరాళ్లు అయిన అన్వి మరియు మనస్వి ల పుట్టినరోజు వేడుకలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించారు, అనంతరం అక్కడి నుండి పొతంగల్ మండలం హెగ్డోలి గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు నగేష్ చేసిన కందూరు విందులో పాల్గొన్నారు, తర్వాత అక్కడి నుండి బయలుదేరి బీర్కూర్ మాజీ సర్పంచ్ శ్రీమతి ఆవారి స్వప్న మరియు నిఖిల్ గార్ల కుమారుడు ద్వారక్ పటేల్ కేశఖండనం కార్యక్రమాన్ని రెంజల్ మండలం కందకుర్తి గ్రామంలో నిర్వహించగా ఆ యొక్క కార్యక్రమానికి హాజరై చిరంజీవి ద్వారక్ ను ఆశీర్వదించారు..

ఈ శుభకార్యాలలో పాల్గొన్నప్పుడు ఆయన వెంట బాన్సువాడ నియోజకవర్గ ఆయా మండలాల బి.ఆర్. ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు భాస్కర్ రెడ్డి వెంట ఉన్నారు బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన తన దూకుడు పెంచారు కెసిఆర్ మరియు తండ్రి ఆశీర్వాదంతో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తల్లో ఉత్సాహం నింపే విధంగా తన ప్రణాళికతో ముందుకు వెళుతున్నాడు రాబోయే లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని కేసీఆర్ గారికి బహుమానం ఇచ్చే విధంగా కార్యకర్తలందరూ పనిచేయాలని సూచించారు

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india