V1News Telangana

best news portal development company in india

భర్త మృతదేహం మార్చురీ గదిలో….. భార్యకు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స

SHARE:

భర్త మృతదేహం మార్చురి లో… భార్య తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో

ఈ విషాద ఘటన బాన్స్వాడలో చోటు చేసుకుంది

భర్త మృతదేహం మార్చురీ గదిలో… భార్య తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ విషాద ఘటన బాన్సువాడలో చోటుచేసుకుంది కుటుంబ సభ్యులు మరియుపోలీసుల కథనం ప్రకారం బాన్సువాడ మదీనా కాలనీలో మమ్మద్ ముక్త్యార్ అనే వ్యక్తి కిరాణా దుకాణం నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు శుక్రవారం లింగంపేట మండలం వెల్లుట్ల గ్రామంలో తమ బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంవల్ల మృతుడు మరియు ఆయన భార్య మహమ్మద్ ఆయేషా బేగం ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లారు శుభకార్యం పూర్తిచేసుకుని శనివారం మధ్యాహ్నం తమ స్వగ్రామమైన బాన్సువాడకు భార్యాభర్తలు ఇద్దరూ తిరిగి వస్తుండగా ఎదురుగా అతివేగంగా నిర్లక్ష్యంగా ప్రయాణిస్తున్న బొలెరో వాహనం ద్విచక్ర వాహనాన్ని ఒక్కసారిగా ఢీకొట్టడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి వెంటనే స్థానికులు గుర్తించి హుటాహుటిన సమాచారం సమాచారం అందించి 108 అంబులెన్స్ లో బాన్సువాడకు తరలించారు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో బాన్సువాడలో ప్రాథమిక చికిత్స చేసి నిజామాబాద్ కు తరలిస్తుండగా నసుల్లాబాద్ సమీపంలో మహ్మద్ ముక్త్యార్ మృతి చెందాడు భార్య తీవ్ర గాయాలకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు మృతదేహాన్ని బాన్సువాడ మార్చురీ గదిలో పెట్టగా మృతుడి భార్య తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది ఈ విషాద ఘటన చూసి పలువురు కంటతడి పెడుతున్నారు కుటుంబ సభ్యులు మరియు బంధువులు బోరున విలపిస్తున్నారు ఈ సంఘటన పలువురిని కలిచి వేస్తుంది ఈ ఘటనకు కారణమైన బొలెరో వాహనం డ్రైవర్ ను కఠినంగా శిక్షించాలంటూ కుటుంబ సభ్యులు బాన్సువాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india