V1News Telangana

best news portal development company in india

బైక్ దొంగల అరెస్టు రిమాండ్ కు తరలింపు

SHARE:

బాన్సువాడ డివిజన్ పరిధిలోని బీర్కూర్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఇద్దరు బైకు దొంగలను పట్టుకుని అరెస్టు చేసి అనంతరం రిమాండ్కు తరలించినట్లు బాన్సువాడ డిఎస్పి టి సత్యనారాయణ వెల్లడించారు

బీర్కూరు మండల కేంద్రంలో గల పోలీస్ స్టేషన్లో శనివారం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి నిందితులను పాత్రికేయుల ముందు హాజరు పరిచారు అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ శనివారం ఉదయం సమయంలో బీర్కూర్ ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో బీర్కూర్ కమాన్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా నంబర్ ప్లేట్ లేని పల్సర్ బైక్ పై బీర్కూరు వైపునకు వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా వారిని పట్టుకుని విచారించారు నిందితులలో అబ్దుల్ అయాజ్ ఖాన్ అనే కుకింగ్ మాస్టర్ అదేవిధంగా బోధన్ పట్టణంలోని రాకాసి పేటకు చెందిన సయ్యద్ రఫీక్ కుమారుడు మహమ్మద్ సమీరుద్దీన్ అనే తొమ్మిదవ తరగతి విద్యార్థిగా గుర్తించామన్నారు వీరిద్దరూ కలిసి ఎలాంటి పని చేయకుండా జులై గా తిరుగుతూ మద్యానికి బానిసై గత నెల రోజుల నుండి కామారెడ్డి జిల్లాలోని పిట్లం బాన్సువాడ బీర్కూర్ సదాశివ నగర్ గాంధారి భిక్కనూరు అలాగే నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నిజామాబాద్ కమ్మర్పల్లి ఇందల్వాయి అదే విధంగా సంగారెడ్డి జిల్లాలోని పెద్ద శంకరంపేట్ కల్హేర్ పోలీస్ స్టేషన్లో తో పాటు ఇతర ప్రాంతాలలో మోటార్ బైకులను దొంగిలించారని తెలిపారు వీరు ప్రధానంగా ఇళ్ళ ముందు నిలిపించిన ద్విచక్ర వాహనాలను పేర్కొన్నారు వారి వద్ద నుండి 21 పల్సర్ బైకులు హోండా స్ప్లెండర్ బైక్ ఒక హోండా యాక్టివా ఒక రాయల్ ఎన్ఫీల్డ్ ఒక హెచ్ఎఫ్ డీలక్స్ హోండా వాహనాలు కలిపి మొత్తం 26 ద్విచక్ర వాహనాలను వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు బాన్స్వాడ రూరల్ సిఐ పి. సత్యనారాయణ గౌడ్ మరియు బీర్కూర్ ఎస్సై రాజశేఖర్ సిబ్బందిని డి.ఎస్.పి అభినందించారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ప్రజలు ఇలాంటి దుండగుల వల్ల అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india