V1News Telangana

best news portal development company in india

బసంతనగర్ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులకు అండగా ఉంటా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తా

SHARE:

బసంతనగర్ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులకు అండగా ఉంటా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తా

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం మార్చ్ 29:-

పార్లమెంట్ ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా నేడు పాలకుర్తి మండలం బసంతనగర్ కేశోరాం సిమెంట్ కంపెనీ కార్మికులని మరియు పలు గ్రామాల ఉపాధి హామీ కూలీలను కలిసారు బిజేపి పార్లమెంట్ అబ్యర్ధి గోమాస శ్రీనివాస్ బిజేపి రామగుండం ఇన్ చార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం కేశోరామ్ సిమెంటు వద్ద గేటు మీటింగ్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ గొమాసే మాట్లాడుతూ కేశోరామ్ సిమెంటు కార్మికుల సమస్యలు పార్లమెంటులో ప్రస్తావిస్తానని , కంపెనీలో పని చేస్తున్న కార్మికులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.కార్మికులకు నిత్యం తాను అండగా ఉంటానని చెప్పారు. ఇక్కడ పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు, పర్మినెంట్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. ఇక్కడ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుకున్నానని, ఖచ్చితంగా సమస్యల పరిష్కారం కోసం క్రుషి చేస్తానని తెలిపారు. కార్మికుల సంక్షేమమే నరేంద్ర మోడీ ధ్యేయమని అన్నారు. అనంతరం కొత్తపల్లి మరియు ఈసాలతక్కల్లపల్లి గ్రామ ఉపాధి హామీ కూలీలనీ కలిశారు.వారు పనిచేస్తున్న పని స్థలాల వద్దకే వెళ్లి వారికి కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాల గురించి వివరించారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు.ఈ కార్యక్రమంలో బిజేపి నాయకులు శ్రీరాముల సత్యం,మామిడాల శ్రీనివాస్,పాత దేవెందర్,మేర్గు నరేష్,తిప్పని రాజుకుమార్,గండికోట కుమార్,గన్నవరపు సాయి,పద్మ,బరుపటి నారాయణ,పైతరి రాజు, తదితరులు పాల్గోన్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india