V1News Telangana

best news portal development company in india

బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ ఇన్చార్జిగా పోచారం భాస్కర్ రెడ్డి నియామకం

SHARE:

బాన్సువాడ శాసనసభ నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి పార్టీ ఇంచార్జి గా నన్ను నియమించిన BRS పార్టీ అధ్యక్షులు శ్రీ కేసీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటి రామారావు గారికి, మాజీ శాసనసభ సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గార్లకు హృదయ పూర్వక కృతజ్ఞతలు.

బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి కష్ట సుఖాలలో అండగా ఉంటున్న నాకు నియోజకవర్గ BRS పార్టీ ఇంచార్జీగా నియామకంతో నా బాధ్యతలు మరింతగా పెరిగాయి.

మీ అందరి సహాయ, సహకారాలతో ఈ నూతన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తాను. నాపై నమ్మకంతో నియోజకవర్గ ఇంచార్జీ పదవిని అప్పగించారు. నిత్యం BRS పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను.

ఈ ప్రయాణంలో మీరందరూ నన్ను మీ కుటుంబ సభ్యునిగా ఎల్లప్పుడూ ఆదరించాలని కోరుకుంటూ..

  1. మీ..
    పోచారం భాస్కర్ రెడ్డి
    BRS పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్.
    మాజీ DCCB చైర్మన్.
Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india