V1News Telangana

best news portal development company in india

3నెలల వేతనాలు చెల్లించాలని విధులను బహిష్కరించి నిరసన తెలియజేస్తున్న ఆస్పత్రి కార్మికులు*

SHARE:

బోధన్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు పనిచేస్తున్న శానిటేషన్, పేషంట్ కేర్ కార్మికులు పెండింగ్లో ఉన్న 3 నెలల వేతనాలు చెల్లించాలని విధులను బహిష్కరించి ధర్నా చేయడం జరిగింది.

ఈ ధర్నాను ఉద్దేశించి తెలంగాణ మెడికల్ కాంటాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (AITUC) అనుబంధం జిల్లా అధ్యక్షులు పి.సుధాకర్ మాట్లాడుతూ బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు గత మూడు నెలల వేతనాలు చెల్లించాలని ఈనెల ఆరవ తేదీన అధికారులకు సంబంధిత కాంట్రాక్టర్కుసమ్మె నోటీస్ ద్వారా తెలియపరచిన ఇప్పటికి వేతనాలు ఇవ్వకపోవడంతో సమ్మె నిర్వహించి నిరసన తెలియజేస్తున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే మూడు నెలల పెండింగ్ వేతనాన్ని చెల్లించాలని, ఇతర సమస్యల పరిష్కరించాలని అధికారులను కోరుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు శంకర్, నాగమణి,సతీష్,జాఫర్,మాధవి, కేజియా, సాయిలు,దత్తు మరియు కార్మికులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india