V1News Telangana

best news portal development company in india

కారుణ్య నియమాలకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సిగ్నల్*

SHARE:

హైదరాబాద్:మార్చి 23.

విద్యుత్ శాఖలో కారుణ్య నియామకాలకు బ్రేక్ వేస్తూ గత సర్కారు తీసుకున్న విధాన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. విధి నిర్వహణలో ఉంటూ చనిపోయినవారి పిల్లలకు కారుణ్య నియామకాలు ఇవ్వకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.మార్చి 4, 2020న జరిగిన 42వ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం, దానికి అనుగుణంగా ఏప్రిల్ 29, 2020న విడుదల చేసిన ఉత్తర్వులను తాజా ప్రభు త్వం ఉపసంహరించుకు న్నది.

దీంతో కారుణ్య నియామ కాలకు వెసులుబాటు లభిం చింది. గత ప్రభుత్వం లో కారుణ్య నియామకాల కోసం వచ్చిన దరఖాస్తులను తిరస్కరించడంతో ఇప్పుడు వాటిని మళ్ళీ పరిగణనలోకి తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలో ఉంది.

ఇందుకు అనుగుణంగా ఏకీకృత యూనిఫాం పాలసీని రూపొందించా లంటూ విద్యుత్ శాఖ పరిధిలోని అన్ని కార్పొరేట్ ఆఫీసులకు సీఎండీ తాజా గా,ఉత్తర్వులు జారీ చేశారు.గతంలో కారుణ్య నియామ కం కోసం దరఖాస్తు చేసుకు న్నవారికి మళ్లీ అప్లికేషన్ ప్రొఫార్మా ఫార్మాట్ ను రూ పొందించాలని, మరోసారి దరఖాస్తు చేసుకోడానికి వారికి అవకాశం కల్పించా లని సూచించారు.
చనిపోయిన ఉద్యోగుల పిల్లల/జీవిత భాగస్వామికి మాత్రమే కాకుండా విధి నిర్వహణకు శారీరకంగా స్థోమత లేని ఉద్యోగుల విషయంలోనూ కారుణ్య నియామకాలకు అవకాశం ఇవ్వాలని తాజా ఉత్త ర్వుల్లో సీఎండీ పేర్కొ న్నారు..

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india