V1News Telangana

best news portal development company in india

ఇసుక డంపింగ్ గురించి ఎమ్మార్వో గంగాధర్ కు ,ఎసై నాగ్ నాధ్ కు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపణలు

SHARE:

నిజామాబాద్ జిల్లా బోధన్ ,సాలురా మండలాలలో మంజీరా పరివాహక ప్రాంతాల నుండి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కొందరి అధికారుల కనుసన్నల్లో స్థానికంగా ఉండే కొందరు రాత్రి వేళల్లో మంజీరా నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. నాగం పల్లి , బిక్నెల్లి గ్రామ శివారులో ఇసుక భారీ ఎత్తున డంపింగ్‌ చేసి రాత్రి,తెల్లవారు జామున సమయాలలో తరలిస్తున్నారు.ఇసుక డంపింగ్ గురించి ఎమ్మార్వో గంగాధర్ కు ,ఎసై నాగ్ నాధ్ కు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కొన్ని రోజుల క్రిందట బిఆర్ఎస్ నాయకుని ఇసుక ట్రాక్టర్ పట్టణంలోని పోలీసులు పట్టుకున్న ఉన్నత అధికారి ఆదేశాల మేరకు వదిలేషరన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.అధికారులే ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.స్థానిక ఎమ్మెల్యే సూదర్శన్ రెడ్డి కొన్ని సభలల్లో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని అధికారులకు ఆదేశించిన నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india