V1News Telangana

best news portal development company in india

లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బోధన్ బస్ డిపో లో నిర్వహించిన ఆరోగ్య మేఘ శిబిరం

SHARE:

లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బోధన్ బస్ డిపో లో నిర్వహించిన ఆరోగ్య మేఘ శిబిరం

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బోధన్ డిపో లో డిపో మేనేజర్ మామిడాల శ్రీనివాస్ సహకారంతో లైన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అపెక్స్ వైటల్ క్లబ్ అద్యక్షులు లయన్ లంక రవి ఆధ్వర్యంలో ఉచిత నిఘా ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది..

ఈయొక్క కార్యక్రమంలో ఆర్ఎంపి రమేష్ చే బీపీ మరియు సామాన్య చికిత్సలు చేయడం జరిగింది మరియు దంత వైద్యులు డాక్టర్ అబ్దుల్ రాజాక్ చే దంత పరీక్షలు లయన్స్ కంటి ఆసుపత్రి బోధన్ ఆధ్వర్యంలో ఆప్తల్మిక్ అసిస్టెంట్ సతీష్ చే కంటి పరీక్షలు చేయడం జరిగింది మరియు ల్యాబ్ టెక్నిషన్ బస్వంత్ చే మధుమేహ వ్యాధి పరీక్షలు చేయడం జరిగింది ఇందులో దాదాపు 220 మంది ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను సైతం ఇవ్వడం జరిగింది ఈయొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథి గా బోధన్ ఏసీపీ పి.శ్రీనివాస్ హాజరు కావడం జరిగింది ముఖ్య అతిథి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అపెక్స్ వైటల్ క్లబ్ అద్యక్షులు లయన్ లంకా రవి సహకారముతో డిపో మేనేజర్ మామిడాల శ్రీనివాస్ ప్రోద్బలంతో ఇంత పెద్ద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి రాత్రి పగలు అని తేడా లేకుండా ప్రయాణికుల కోసం ఎంతో కష్టపడుతున్న వారికి ఆరోగ్యం బాగుండాలని సదుద్దేశం తో ఏర్పాటు చేసినందుకు లంక రవి కి మరియు డిపో మేనేజర్ మామిడాల శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలిపారు

ఇంకా ఈయొక్క కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అపెక్స్ వైటల్ సభ్యులు లయన్స్ ప్రవీణ్, అనిల్, నాగబుష్ణం, రమేష్ గౌడ్, డిపో సిబ్బంది ఎయి హరిప్రసాద్, సిఐ జనబాయ్, హెడ్ కానిస్టేబుల్ విజయ్, లోగం సుదర్శన్, నవీన్, బెజుగం శంకర్ తదితరులు పాలుగొన్నారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india