V1News Telangana

best news portal development company in india

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో తెల్ల కల్లు బార్లు*

SHARE:

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో తెల్ల కల్లు బార్ల

రాష్ట్రంలో రానున్న రోజుల్లో ‘కల్లు బార్ల్లు’ ఏర్పా టు చేసే దిశగా తమ ప్రభుత్వం కార్యాచరణ రూపొంది స్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

గౌడ సంఘం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎఎస్‌ఎన్ ఫంక్షన్ హాల్‌లో గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళ నం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత కాలానుగుణంగా కులవృత్తులు మారుతున్నా యని, అన్ని రకాల వ్యాపా రాల తీరు మారుతోందని అన్నారు.

ఈ నేపథ్యంలో అనాదిగా వస్తున్న కల్లుగీత వృత్తి నేడు కనుమరుగు అవుతుందని ఈ వృత్తిని కాపాడాల్సి అవసరం ఉందన్నారు. గీత కార్మికుల వృత్తిని కూడా ఆధునికీకరించాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు.

అందులో భాగంగా కల్తీ కల్లు లేకుండా గౌరవప్రదంగా విక్రయించే దిశగా ప్రభుత్వ పరంగా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఉందని, దీనివల్ల ఎంతోమందికి మేలు చేకూరుతుందని అభిప్రాయపడ్డారు.

సర్వాయి పాపన్న విగ్రహం ట్యాంక్‌బండపై ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళ నంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, పలువురు ఎంఎల్‌ఎలు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డి, మహబూబ్‌ నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, నాయకులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india