V1News Telangana

best news portal development company in india

అదిష్టానం నిర్ణయానికి నియోజకవర్గ స్థాయి నాయకులు కట్టుబడి ఉంటారా….?

SHARE:

బీజేపీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గా బిబి పాటిల్….

పార్టీ లో చేరిన 24 గంటలోనే బీజేపీ పార్టీ ఎంపీ టికెట్….

జహీరాబాద్ ఎంపీ గా రెండు సార్లు బరాస పార్టీ నుండి గెలుపొందిన బిబి పాటిల్ గత కొద్ది రోజుల క్రితం బిఆరెఎస్ పార్టీ ని వీడి బీజేపీ లో చేరారు. బీజేపీ పార్టీ లో చేరినంతరం బీజేపీ పార్టీ అధిష్టానం ఆయన కు జహీరాబాద్ ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేసింది. అధిష్టానం నిర్ణయానికి విరుద్ధంగా బీజేపీ పార్టీ తరుపున జహీరాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న జైపాల్ రెడ్డి అనుచరులు హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ కి విరుద్ధంగ ప్రచారాలు చేసి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కి మద్దతు పలికిన బిబి పాటిల్ కు బీజేపీ పార్టీ క్యాడర్ సహకరిస్తద? జహీరాబాద్ లోక్ సభ పరిధిలోని ఉన్న 7 నియోజకవర్గ లో కామారెడ్డి తప్ప మిగిత 6 నియోజకవర్గ లో బీజేపీ పార్టీ ఓటమి పాలయింది. అయితే కామారెడ్డి నియోజకవర్గం లో ఇద్దరు సీఎం అభ్యర్థుల పై ఎమ్మెల్యే గా గెలుపొందిన వెంకటరమణ రెడ్డి బిబి పాటిల్ కు సహకరిస్తారా అనే ప్రశ్నలు వెళ్లవాడుతున్నాయి. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటరమణ రెడ్డి కి విరుద్ధంగ బిబి పాటిల్ ప్రచారాలు చేసారు.అయితే వెంకటరమణ రెడ్డి పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతారా లేదా వేచి చూడాల్సి ఉంది.జహీరాబాద్ టికెట్ ఆశించిన వారు కాంగ్రెస్ పార్టీ లో చేరే అవకాశాలున్నాయని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india