రుద్రూర్ మండల కేంద్రంలోని అక్బర్ నగర్ గ్రామంలో నూతన వ్యవసాయ డిగ్రీ కళాశాల మంజూరు చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వర్ రావు, బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్బంగా మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. రానున్న కాలంలో ఇంజనీరింగ్ టెక్నాలజీలో వ్యవసాయంలో కూడా ఆధునిక పద్దతిలో దిగుబడులు, వ్యవసాయంలో మెలుకువలు సాధించడానికి విశ్వవిద్యాలయాలు చాలా అవరసమన్నారు. కావున స్థానిక విద్యార్థుల ఆకాంక్షను నెరవేరుస్తున్నందుకు రుద్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్, పార్టీ ఉపాధ్యక్షులు నడిపింటి నగేష్, ఎంపిటిసి అనీల్ పటేల్, గౌస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరి కార్తీక్, పార్వతి ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాంబాబు, తిగుల్ల గంగామణి వరప్రసాద్, సయ్యద్ ముల్తాని, లాల్ మొహమ్మద్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Author: IRFAN Reporter
Work from as a journalist








