V1News Telangana

best news portal development company in india

పటిష్ట బందోబస్తు నడుమ 44 హుండీల లెక్కింపు ప్రారంభం

SHARE:

పటిష్ట బందోబస్తు నడుమ 44 హుండీల లెక్కింపు ప్రారంభం

 

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం ఫిబ్రవరి 26:-

 

గోదావరిఖని శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. జనగామ శివారులో ఈనెల 21 తారీకు నుంచి 24 తారీకు వరకు నిర్వహించిన సమ్మక్క సారలమ్మ జాతరలో 44 హుండీలను ఏర్పాటు చేశారు. అయితే 44 హుండీలను సోమవారం ఉదయం 10:30 కు లెక్కింపు ప్రారంభించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మరియు ఈవో అధికారుల సమక్షంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 44 హుండీల లెక్కింపును ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి శ్రీ సీతారామ సేవ సమితి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపును ప్రారంభించామని కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈనెల 21 తారీకు నుండి 24 తారీకు వరకు నిర్వహించిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులు సమర్పించిన కానుకలను ఈరోజు ఉదయం 10:30 నుండి దాదాపు సాయంత్రం 8 గంటల వరకు హుండీ లెక్కింపు కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. పటిష్ట బందోబస్తు నడుమ హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహిస్తున్నామని అలాగే సీసీటీవీ ఆధ్వర్యంలో ఈ హుండీ లెక్కింపు జరుగుతుందని కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బంగారి రాజయ్య మోహన్ రెడ్డి జె కనకయ్య వి వామన్ రావు శ్రీనివాస్ రెడ్డి ఈవో కాంత రెడ్డి మున్సిపల్ అధికారులు పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india