V1News Telangana

best news portal development company in india

పోలీస్ వ్యవస్థకు మారు పేరు కలమేశ్వర్ సింగిన్వార్..

SHARE:

కమిషనర్ కలమేశ్వర్ సింగిన్వార్ అనే పేరు వింటే చాలు అవినీతి అక్రమాలు చేసే వారి గుండెల్లో దడ పుడుతుంది..

పోలీస్ అనే పదానికి నిదర్శనం నిజామాబాదు జిల్లా కమిషనర్ కల్మేశ్వర్ సింగిన్వార్. అవినీతి,అక్రమాలు,ఇష్టారాజ్యం చాలా ఇస్తున్న నేటి రోజుల్లో నిర్భయంగా తన కర్తవ్యాలను లక్ష్యంగా భావించి పోలీస్ వ్యవస్థ పై ప్రజలకు నమ్మకం కలిగేలా నిజామాబాద్ జిల్లాలో అవినీతి అనే పదం కనబడకుండా చేస్తున్నారు కల్మేశ్వర్ సింగిన్న్వార్. ఎవరైనా నాయకుల రికమండేషన్ తీసుకొస్తే అసలుకే పట్టించుకోరు ఏది ఏమైనా న్యాయమే గెలవాలి అవినీతి చేసిన వాడికి శిక్ష పడాలనే ముఖ్య ఉద్దేశమే ఆయన లక్ష్యం. తప్పు చేసిన వారు ఎవరైనా సరే చట్టం దృష్టిలో నిందితుడేనని పోలీసు వ్యవస్థపై ప్రజలు పూర్తిగా నమ్మేలా ఈయన నిజామాబాద్ జిల్లాలో తన కర్తవ్యలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని కిందిస్థాయి పోలీస్ అధికారులు సైతం కల్మేశ్వర్ సింగిన్వార్ ఆదేశాల మేరకు అక్రమ రవాణాల పైన జరిగే అవినీతి పైన చర్యలు తీసుకుంటున్నారు. కల్వేశ్వర్ సింగిన్వార్ నిజామాబాద్ జిల్లా సిపిగా వచ్చినప్పటి నుండి అవినీతి చేయాలంటే వారి గుండెల్లో దడ పుడుతుంది. ఈయన జిల్లా స్థాయి అధికారిగా ఉన్నప్పటికీ కింది స్థాయి అధికారులను రోజురోజుకు ఫోన్ కాల్ ద్వారా అదేశాలు ఇస్తూ నిజామాబాద్ జిల్లాను శాంతియుతంగా మార్చారు. రాత్రి సమయంలో తప్పచబుత్ర కార్యక్రమాన్ని స్వయంగా ఆయనే తమ సిబ్బందితో కలిసి నిర్వహిస్తున్నారు. కల్మేశ్వర్ సింగిన్వార్ అనే పేరు వింటే చాలు అవినీతి అక్రమాలు చేసే వారి గుండెల్లో దడ పుడుతుంది. నిర్భయంగా తమ కర్తవ్యాలను గుర్తుంచుకొని ప్రజాసేవ చేస్తూ వస్తున్న కల్మేశ్వర్ సింగిన్వార్ లగా ప్రతి అధికారి దేశవ్యాప్తంగా ఉంటే భారతదేశం మొత్తంలో అవినీతి అక్రమాలు అసలుకే కనబడకుండా పోతాయి. కల్మేశ్వర్ సింగిన్వార్ నిజామాబాద్ జిల్లా కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి జిల్లాలో క్రైమ్ రేట్ చాలా వరకు తగ్గింది. ప్రజలు సురక్షితంగా ఉండాలని,ప్రజలకు పోలీసు వ్యవస్థ పై నమ్మకం ఉండాలని,పగలు రాత్రి 24 గంటలు తమ కర్తవ్యాలు సక్రమంగా నిర్వహిస్తున్న నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగిన్వార్ ను స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india