V1News Telangana

best news portal development company in india

వనదేవతల పూజా కార్యక్రమాల్లో మొక్కులు చెల్లించుకుని నిలువెత్తు బుట్ట బంగారం సమర్పించుకున్న- రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ దంపతులు

SHARE:

వనదేవతల పూజా కార్యక్రమాల్లో మొక్కులు చెల్లించుకుని నిలువెత్తు బుట్ట బంగారం సమర్పించుకున్న- రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ దంపతులు

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం ఫిబ్రవరి :-

గోదావరిఖని :- గంగానగర్ గోదావరి నది తీరం ఒడ్డున వెలిసిన సమ్మక్క సారలమ్మ వనదేవతల జాతర సందర్భంగా బుదవారం రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ వారి సతీ సమేతంగా సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాల్లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని నిలువెత్తు బుట్ట బంగారం అమ్మవారికి సమర్పించిన అనంతరం వన దేవతలను మొక్కుకుని దర్శనార్థం వచ్చే భక్తులకు ఆయురారోగ్యాలతో పాటు సుఖసంతోషాలు ప్రసాదించండి వారి పిల్ల పాపల్ని చల్లంగా చూడు తల్లి అని వనదేవతలకు మొక్కులు చెల్లించుకోవడం జరిగినది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా లాగా జరిగే వనదేవతల జాతర నిజంగా చాలా ఆధ్యాత్మికమైన జాతర అని సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడం అంటే ప్రకృతి మాత ఆశీర్వచనాలు తీసుకోవడం లాంటిదని సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులకు మరియు కమిటీ వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నానని భక్తులకు ఏవైనా ఆటంకాలు ఎదురైతే నా దృష్టికి తీసుకురండని అని, ఈ సoధర్బంగా తెలియజేయడం జరిగింది.కార్యక్రమంలో ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ దంపతులతో పాటు, కార్పొరేటర్లు,జాతర కమిటీ చైర్మన్ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు మరియు ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ విభాగాల అధ్యక్షులు, పలు విభాగాల నాయకులు, కార్యకర్తలు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india