V1News Telangana

best news portal development company in india

శ్రీ సమక్క సారలమ్మ జాతర ఏర్పాట్ల పరిశీలన అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్

SHARE:

శ్రీ సమక్క సారలమ్మ జాతర ఏర్పాట్ల పరిశీలన అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం, ఫిబ్రవరి 20:    

జిల్లాలో నిర్వహించే శ్రీ సమక్క-సారలమ్మల జాతర పనులు పరిశీలించామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా విజయవంతంగా జాతర నిర్వహించేందుకు సన్నద్ధంగా ఉన్నామని అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ తెలిపారు. మంగళవారం రోజున రామగుండంలోని గోదావరి నది ప్రాంగణంలో చేసిన జాతర ఏర్పాట్లను, పరిశిలించిన అదనపు కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ, గోదావరిఖని, ప్రాంతంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి శ్రీ సమక్క – సారలమ్మల జాతరను నిర్వహిస్తున్నారని తెలిపారు. జిల్లాలో ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 24 వరకు నిర్వహించు జాతరలో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవార్లను దర్శించుకునే అవకాశం ఉన్నదని, ఈ జాతరను విజయవంతంగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారని అన్నారు.జాతరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, పెండింగ్ లో ఉన్న చిన్న పనులను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. సమక్క, సారలమ్మ గద్దెలను, రోడ్లు, తాగునీటి వసతులను అదనపు కలెక్టర్ పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని, జాతర సమయంలో నది లోపలికి వెళ్లకుండా ఏర్పాట్లు చేయాలని గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంచుకోవాలని, జాతర సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు.ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గోన్నారు.

 

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india