V1News Telangana

best news portal development company in india

రైల్వే సమస్యలు విస్మరిస్తే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు..* *శివకుమార్ – (బోధన్ విద్యార్థి జేఏసీ నాయకులు)*

SHARE:

ఎడపల్లి , శక్కర్ నగర్ రైల్వే స్టేషన్ లు రద్దు చేస్తే నోరు తెరవలేదు ఎంపీ గారు

ఎంపీ గా అభివృద్ధి చెయ్యలేదని కోరుట్లలో ప్రజలు తీర్పునిచ్చారు..

పార్లిమెంట్ పరిధిలో రైల్వే డబ్లింగ్, నూతన రైల్వే లైన్లు పై ఊసే లేదు…

మీరు గత బడ్జెట్లో ఇచ్చినటువంటి నిధులు ఎంత? గత నాలుగు ఏళ్ళ లో రైల్వే వ్యవస్థ ఆధునికరణకు మరియు రైల్వేస్టేషన్లో కనీస మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని అన్నారు. మరి ఎన్నడూ లేని విధంగా ఎంపీగా ఉన్న కేంద్ర పార్టీ బిజెపి అధికారంలో ఉన్నప్పుడే బోధనలోని శక్కర్ నగర్ రైల్వే స్టేషన్ మరియు ఎడపల్లి మండల లోని రైల్వే స్టేషన్ అశ్వతంగా మూసివేసి రెండు సంవత్సరాలు గడుస్తున్న కనీసం వాటిపై మాట్లాడకపోవడం సిగ్గుచేటు అన్నారు.. కేవలం రాజకీయ లబ్ధి తప్ప ప్రజా క్షేమం కోసం పనిచేస్తున్నట్టు లేదని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా బడ్జెట్లో తెచ్చిన ఆర్థిక అంశాలు మరి నిజామాబాద్ జిల్లాలో రైల్వే ఆధునీకరణ పనులు గాని కనీసం స్టేషన్లో ఆధునికరణ రైల్వే డబ్లింగ్ లైన్ కనీస ప్రతిపాదనలో కూడా తీరే పరిస్థితిలో జిల్లా నోచుకోలేదు అన్నారు . నూతన రైల్వే లైన్ లు ఒకటి అంటే ఒక్క కొత్త రైళ్ల కూడా తేలేదని దాని కోసం పార్లమెంట్ లో మాట మాట్లాడలేదని అన్నారు . కనీసం రైల్వే సమస్యలపై పార్లమెంట్లో గళం విప్పే పరిస్థితి కూడా ఎంపీ గారికి లేదు అన్నారు. మరి పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ బోధన్ లో నెలకొన్న సమస్యలు అయినటువంటి బోధన్ రైల్వే సమస్య, శక్కర్ నగర్ రైల్వే స్టేషన్ ,ఎడపల్లి రైల్వే స్టేషన్ మూతపడ్డాయి.రెండు సంవత్సరాలు గా రైల్వే స్టేషన్ లు మూసి వేసిన దానిపై నోరు మెదప లేదని . బోధన్ డివిజన్ హెడ్ క్వార్టర్ పోస్ట్ ఆఫీస్ శిధిలావస్థకు చేరిన దానికి ఆధునికరణ పనులు చేయ లేదని గత ఐదేళ్లలో చేసింది ఏందో ప్రజలకు వివరించాలని లేకపోతే ప్రజలు కోరుట్ల లో పట్టిన గతే వచ్చే ఎంపీ పార్లిమెంట్ ఎన్నికలో ప్రజలు ఓటు తో సమాధానం చెప్తారని అన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india