V1News Telangana

best news portal development company in india

వర్ని ఎమ్మెల్యే స్ పాయింట్ ఇన్చార్జి శివకుమార్ను నిలదీసిన రేషన్ డీలర్లు వందల క్వింటల బియ్యం తగ్గుతూ ఇస్తూ, తూకంలో మోసం చేస్తూ, బ్లాక్లో అమ్ముకుంటున్న ఇన్చార్జి శివకుమార్

SHARE:

వర్ని ఎమ్మెల్యే స్ పాయింట్ ఇన్చార్జి శివకుమార్ను నిలదీసిన రేషన్ డీలర్లు
వందల క్వింటల బియ్యం తగ్గుతూ ఇస్తూ, తూకంలో మోసం చేస్తూ, బ్లాక్లో అమ్ముకుంటున్న ఇన్చార్జి శివకుమార్
డీలర్ల పట్ల పక్షపాత ధోరణి, కక్షపూరితంగా వ్యవహరిస్తున్న ఇంచార్జ్ శివకుమార్
సంవత్సనర నుంచి అనేక ఇబ్బందులు పెడుతూ మోసం చేస్తున్న ఇన్చార్జి శివకుమార్
ప్రశ్నిస్తే విజిలెన్స్ తో దాడులు చేయించి మీ అంతు చూస్తానని బెదిరింపులు చేస్తున్న ఇంచార్జ్ శివకుమార్
డీలర్లకు శాపంగా మారుతున్న శివకుమార్ పై చర్యలు తీసుకోండి…

వర్ని ఎమ్మెల్యేస్ పాయింట్ ఇన్చార్జి శివకుమార్ అవకతవకలకు పాల్పడుతూ, రేషన్ డీలర్ల పాలిట శాపంగా మారుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, డీలర్లంతా ఆయన తీరుపై మండిపడుతూ, ఆయన ను నిలదీశారు. ఈ సందర్భంగా డీలర్లు అంతా కలిసి మాకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని, ఈ అన్యాయానికి కారణం ఎమ్మెల్యేస్ పాయింట్ ఇన్చార్జి శివకుమార్ అని వారు ఆరోపణ చేశారు. డీలర్లు మీర్జాపురం సాయన్న, లక్ష్మణ్, రాజారెడ్డి, కొత్తపల్లి రాజేశ్వర్, ఆంజనేయులు, కిషన్, మారుతి, నగేష్ తో పాటు పలువురు డీలర్లు మాట్లాడుతూ, ప్రతి డీలర్ షాపు ల లో సగభాగం సన్న బియ్యం, సగభాగం దొడ్డు బియ్యం రావడంతో ప్రజలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారని డీలర్లు తెలిపారు. ఎమ్మెల్యేస్ పాయింట్లు వచ్చిన బియ్యానికి కచ్చితంగా తూకం చేయాలని వే బ్రిడ్జి లేదా కాటా తో తూకం చేయాలని అన్నారు. స్టేజ్ వన్ నుంచి లారీల ద్వారా వచ్చిన, బియ్యం నేరుగా స్టేజ్ టూ లారీలో డంపు చేయకుండా, గోదాంలో నిలువ చేసి, వే బ్రిడ్జి లేదా ఎమ్మెల్యేస్ పాయింట్ల ఉన్న కాటల ద్వారా తూకం చేసి, డీలర్ షాపులకు పంపాలని, అప్పుడే తమకు న్యాయం జరుగుతుందని అన్నారు. స్టేజ్ వన్ నుంచి లారీల ద్వారా వచ్చిన బియ్యం సంచులు చాలా వరకు చినిగిపోతుందని, దీనివల్ల కూడా తరుగు వస్తుందని వారు తెలిపారు. చిరిగిపోయిన సంచుల ద్వారా కూడా లాస్ అవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అన్యాయం జరుగుతుందని ఎమ్మెల్యేస్ పాయింట్ ఇన్చార్జి వద్ద వచ్చి అడిగితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, డిఎస్ఓ ద్వారా, విజిలెన్స్ ద్వారా రైడింగ్ చేయించి తమపై యాక్షన్ తీసుకుంటామని బెదిరింపులు చేస్తున్నారని వాపోయారు. ఎమ్మెల్యేస్ పాయింట్ ఇన్చార్జి శివకుమార్ వందల క్వింటాళ్ల బియ్యం తరుగు ప్రతి కోటాకు ఇస్తున్నారని, వందల క్వింటల తరుగు బియ్యం ఎక్కడ అమ్ముకుంటున్నారో సమాధానం చెప్పాలని నిలదీశారు. వర్ని ఎమ్మెల్యేస్ పాయింట్ పరిధిలో 67 డీలర్ షాపులు ఉన్నాయని అన్నారు.67 మందిలో పదిమంది ఇన్చార్జిలు ఉండగా ,ఇంతమంది డీలర్లకు తరుగు వస్తుందని ఎన్నిసార్లు ఇన్చార్జి చెప్పిన పట్టించుకోవడంలేదని తిరిగి దురుసుగా మాట్లాడుతున్నారని తెలిపారు.

ఎమ్మెల్యే స్పాయింట్లో వస్తున్న ధాన్యం ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నాయని ఇక్కడున్న, చాలామంది రైస్ మిల్లర్లు, రైతుల ద్వారా నేరుగా కొనుగోలు చేసిన ధాన్యం ఇవ్వకుండా, వాటిని అధికరేట్లకు విక్రయిస్తూ, వారి లక్ష్యం నెరవేర్చడం కోసం ఇతర రాష్ట్రంలో నుండి నాణ్యతలేని బియ్యం దొడ్డు బియ్యం తో పాటు రాళ్లు ఇసుక గోధుమతో ఉన్న బియ్యం సరఫరా చేస్తున్నారని, అంతేకాకుండా బియ్యం పిండి అవుతుందని, కొత్తపల్లి గ్రామంలో సుమారు గ్రామస్తులంతా కలిసి బియ్యం తీసుకు పోమని ఎదురు తిరిగి వాటిని వాపస్ చేయడం జరిగిందని కొత్తపల్లి డీలర్ రాజేశ్వర్ తెలిపారు ఈ సందర్భంగా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఫిర్యాదు చేస్తే బియ్యం వాపస్ తీసుకున్నారని నాణ్యతలేని బియ్యం వచ్చిందని బియ్యం పిండి పిండి అయిందని గ్రామస్తులంతా ఏకమై బియ్యాన్ని తిరిగి ఇచ్చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇక్కడున్న చాలామంది రైస్ మిల్లర్ల నిర్వాహకులు మాఫియాకు పాల్పడుతున్నారని వారి మాఫియా మూలంగా నిరుపేద ప్రజలకు ప్రభుత్వం ద్వారా సరఫరా అయ్యే బియ్యం సరిగా వస్తలేదని, ప్రజలు తినే యోగ్యంగా బియ్యం లేవని అన్నారు. అంతేకాకుండా 100 కింటాళ్ల బియ్యంలో సగం సన్నం సగం దొడ్డు బియ్యం వస్తుందని ఇస్తే దొడ్డు ఇయ్యాలని లేకపోతే సన్న బియ్యం ఇయ్యాలని దీని వల్ల కూడా ప్రజల నుంచి నిరసనలు వస్తున్నాయని వారు పేర్కొన్నారు. ఈ విషయంపై జిల్లా స్థాయి అధికారులు స్పందించి, మాకు న్యాయం చేయాలని వారు తెలిపారు .లేని పక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ప్రతి ఒక్క డీలర్ కు ప్రతినెల 4 నుంచి 5 కింతల తరుగు వస్తుందని మొత్తం కోటకు 100 కింటల వరకు తరుగు వస్తుందని, ఈ తరువు వల్ల తీవ్రంగా లాస్ అవుతున్నామని డీలర్లు తెలిపారు, బియ్యం సరిగా రాకపోవడంతో, ప్రజలు బియ్యం తీసుకోవడానికి వెనుకాడుతున్నారని దీని వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇన్చార్జి శివకుమార్ను వివరణ కోరగా తాను వందల క్వింటాళ్ల బియ్యం తీసుకుంటే నిరూపించాలని దేనికైనా సిద్ధమని సమాధానం ఇచ్చారు, తూకం చేయాల్సి ఉండగా వారే లారీల లో నేరుగా వేసుకొని పోతున్నారని దానికి నేనేమీ చేయాలని సమాధానం ఇచ్చారు. నేను ఎవరి పై దౌర్జన్యం చేయడం లేదని సమాధానం ఇచ్చారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india