తెలంగాణలో ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతర.. ఈనెల 21 నుంచి 24 వరకు జరగనుంది.
మేడారం జాతరను రాష్ట్ర జాతరగా ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక నిధులు కూడా కేటాయిం చారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ దగ్గరుండి పనులు పర్యవేక్షి స్తున్నారు. జాతరకు నెల రోజుల ముందు నుంచే భక్తుల రద్దీ పెరగింది.
ఇక మేడారంలో భక్తులు ప్రత్యేకంగా మెుక్కులు చెల్లించుకుంటారు. తమ కోరికలు తీరితే ఎత్తు బంగారం బెల్లం సమర్పిస్తా మని అమ్మవార్లను మెుక్కుకుంటారు. నిజానికి మేడారం జాతర అంటేనే అందరికి బెల్లం గుర్తొస్తుంది. భక్తులు బెల్లాన్ని అమ్మవార్ల కు సమర్పిస్తారు.
అయితే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులకు అలర్ట్. ఇకపై జాతరకు వెళ్లే భక్తులు, ముఖ్యంగా అమ్మవార్లకు నిలువెత్తు బంగారం,బెల్లం సమర్పించేవారు తప్పనిసరిగా ఆధార్ కార్డులు తీసుకెళ్లేలా అధికారులు నిబంధన తీసుకొచ్చారు.
నిలువెత్తు బంగారం సమర్పించే భక్తుల వివరాలను తప్పనిసరిగా సేకరించాలని వ్యాపారుల ను ఎక్సైజ్ శాఖ ఆదేశించిన ట్లుగా తెలిసింది.
ఎత్తు బెల్లం కొనుగోలుకు భక్తుల నుంచి ఆధార్, ఫోన్ నెంబర్, అవసరమైతే ఇంటి అడ్రస్ తీసుకుని బెల్లాన్ని విక్రయించాలని వ్యాపారులకు ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
జాతర పేరుతో కొందరు అక్రమార్కులు బెల్లాన్ని గుడుంబా (సారా) తయారీ కోసం పక్కదారి పట్టించే అవకాశం ఉండటంతో ఈ నిబంధన పాటించాలని ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు పలువురు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








