V1News Telangana

best news portal development company in india

బచ్పన్ అకాడమిక్ హైట్స్ స్కూల్లో పిల్లల భవిష్యత్తుకు బరోసా కరువు నిర్మాణం పూర్తికాని భవనాల్లో విద్య బోధన పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న యాజమాన్యం చోద్యం చూస్తున్న విద్యాశాఖ అధికారులు

SHARE:

బచ్పన్ అకాడమిక్ హైట్స్ స్కూల్లో పిల్లల భవిష్యత్తుకు బరోసా కరువు

నిర్మాణం పూర్తికాని భవనాల్లో విద్య బోధన పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న యాజమాన్యం

చోద్యం చూస్తున్న విద్యాశాఖ అధికారులు

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం ఫిబ్రవరి :-02

గోదావరిఖని ఎన్ టి పి సి  నిర్మాణం పూర్తి గాని భవనాల్లో తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ప్రాణాలతో చెలగాటమాడుతున్న బచ్పన్ అకాడమిక్ హైట్స్ స్కూల్ యాజమాన్యంపై వెంటనే కఠిన చట్టపర చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డివైఎఫ్ఐ) ఆధ్వర్యంలో మండల విద్యా వనరుల (సీసీఓ) క్రాంతి కుమార్ కి ఫిర్యాదు చేయడం జరిగిందని జిల్లా అధ్యక్షులు కొంటు సాగర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో విద్యను కేవలం ఒక వ్యాపారంగా ఎంచుకొని విచ్చల విడిగా ఎటువంటి పూర్తి స్థాయిలో అనుమతులు పొందకుండా ఇక్కడి తల్లిదండ్రులను మాయమాటలతో మెప్పించి వారి యొక్క పిల్లల భవిష్యత్తుతో జీవితాలతో ఆటలాడుతున్నారని వారు తెలిపారు. ఎన్ టి పి సి కృష్ణ నగర్ లోని బచ్పన్ అకాడమిక్ హైట్స్ స్కూల్ యాజమాన్యం ఒక అడ్రస్ పేరుతో అనుమతులు తీసుకొని ఇదే ప్రాంతంలో H.NO : 5-6-kr0016 G+2 నెంబర్ గల భవనంలో మరియు మల్కాపురంలో సింధూర కాలేజ్ పక్కన గల నూతనంగా నిర్మాణం అవుతున్న భవనంలో పాఠాలు బోధించడాన్నీ వారు తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఒక విద్యా సంస్థ ప్రారంభించాలంటే పూర్తి స్థాయిలో ఎం ఈ ఓ  నుండి అన్ని అనుమతులు పొందిన తర్వాతనే పాఠశాల బోర్డులు ఏర్పాటు చేసి ప్రారంభించాలి. కానీ ఇక్కడ పాఠశాల యొక్క భవన నిర్మాణం (మల్కపుర్) లో పూర్తికాక ముందే గ్రౌండ్ ఫ్లోర్లో పాఠాలు చెబుతుండగానే మొదటి అంతస్తులో భవన నిర్మాణ పనులు ఏదేచ్ఛగా కొనసాగుతుండడం మండల విద్యాశాఖ అధికారుల తీరుపై తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని వారి సందర్భంగా అన్నారు. హంగులు ఆర్భాటాలతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసపూరిత మాటలతో మాయ చేస్తున్న ఇటువంటి కార్పొరేట్ పాఠశాలలపై వెంటనే తగు చర్యలు తీసుకొని వాటి అనుమతులు రద్దు చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో స్కూలు యాజమాన్యంపై అదే విధంగా సంబంధిత అధికారులపై ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india