V1News Telangana

best news portal development company in india

సమన్వయం తో పని చేసి సమ్మక్క సారలమ్మ జాతర గతంలో కంటే ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలి రామగుండం శాసన సభ్యులు ఎం ఎస్ రాజ్ ఠాకూర్

SHARE:

సమన్వయం తో పని చేసి సమ్మక్క సారలమ్మ జాతర గతంలో కంటే ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలి రామగుండం శాసన సభ్యులు ఎం ఎస్ రాజ్ ఠాకూర్

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం జనవరి :- 29:-

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో వచ్చేనెల జరిగే సమ్మక్క సారలమ్మ జాతర అన్ని విభాగాలు సమన్వయం తో పని చేసి సమ్మక్క సారలమ్మ జాతర గతంలో కంటే ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని రామగుండం శాసన సభ్యులు ఎం ఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు . సోమవారం గోదావరి పుష్కర ఘాట్ వద్ద సమ్మక్క సారలమ్మ జాతర స్థలాన్ని ఆయన సందర్శించారు. గద్దెల వద్ద కొబ్బరి కాయ కొట్టిన అనoతరం ఏ విభాగాలు ఏఏ పనులు చేయాలో దిశా నిర్దేశం చేశారు. ముందుగా జాతర పరిసరాలలో ఓ బి మట్టితో నింపి ఎగుడు దిగుడు లేకుండా సింగరేణి సంస్థ సరి చేయాలని అన్నారు. ఆ తరువాత వాణిజ్య దుకాణాలు , పోలీస్ కంట్రోల్ రూమ్స్ , వార్ రూమ్స్ , మెడికల్ రూమ్ , మీడియా రూమ్ , ఎంట్రీ ఎగ్జిట్ తదితర అన్నింటినీ పొందు పరిచి లే అవుట్ తయారు చేయాలని అన్నారు. లే అవుట్ ప్రకారం క్రమ పద్దతిలో స్టాల్స్ ఏర్పాటు చేయించాలని అన్నారు. రోడ్డు వైపుకు కొట్టుకు పోయిన బోటు ను క్రేన్ సహాయంతో నది వద్దకు చేర్చి ప్రారంబించడానికి సిద్దంగా ఉంచాలని సింగరేణి అధికారులను ఆదేశించారు. జాతర స్థలం వైపు ఉన్న శ్మశాన వాటిక గోడను సింగరేణి సంస్థ ఎత్తు పెంచాలని అప్పటి వరకు తాత్కాలికంగా తడకలు ఏర్పాటు చేయాలని అన్నారు. గోదావరి ఒడ్డు పరిశుభ్రం చేయాలని ఆదేశించారు. బుట్టలు ఏర్పాటు చేసి ప్లాస్టిక్ ఎప్పటికప్పుడు అందులో వేసేలా అవగాహన కల్పించాలని అన్నారు. అమ్మవార్ల గద్దెలకు కొత్త టైల్స్ వేయడంతో పాటు లోపలి ప్రాంగణమoతా తాండూర్ రాయి వేసి నున్నగా చేయించాలని అన్నారు. గోదావరి పుష్కర ఘాట్ వద్ద మెట్లకు నీటికి మధ్య ఉన్న స్థలంలో జారి పడకుండా ఎన్ టి పి సి సంస్థ ఫ్లోరింగ్ చేయించాలని అన్నారు . షెడ్ల ఏర్పాటు ఆర్ ఎఫ్ సి ఎల్ చేయాలని అన్నారు. విద్యుత్ కనెక్షన్స్ గజిబిజిగా అపాయకర స్థితిలో కింద నుండి ఇవ్వవద్దని ఎన్ పి డి సి ఎల్ అధికారులకు సూచించారు. సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు అమ్మ వార్లు వచ్చేటప్పుడు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది త్రాడుతో రక్షణగా ఉండాలని అన్నారు. పోలీస్ కమిషనర్ తో సహా స్థానిక పోలీస్ ఉన్నతాధికారులు అమ్మ వార్లు వచ్చేటప్పుడు హాజరై స్వాగతం పలికి గౌరవించుకోవాలని అన్నారు. భక్తులకు మరింత మంచి సేవలందించడానికి వాణిజ్య సంస్థలు , స్వచ్చంద సంస్థల సహకారం తీసుకోవాలని అన్నారు. జాతరలో సింగరేణి , ఎన్ టి పి సి సంస్థలు తమ సిబ్బందితో పాటు అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని , వాహనాలను ఏర్పాటు చేయాలని అన్నారు. లైటింగ్ ఏర్పాట్లు సింగరేణి సంస్థ , ఎన్ పి డి సి ఎల్ చేయాలని అన్నారు. శివుని విగ్రహం చుట్టూ పొదలు శుభ్రం చేసి , రంగు రంగు బొమ్మలతో గోడలు సుందరంగా తీర్చిదిద్దాలని అన్నారు. మేడారం తరహాలో ఈ ప్రాంతoలో శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టి సమ్మక్క జాతర కు వైభవం తీసుకురావడంతో పాటు సుందర పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి సింగరేణి సంస్థ చొరవ తీసుకోవాలని అన్నారు. ఈ సంధర్భంగా కార్పొరేటర్లు ధాతు శ్రీనివాస్ , మహంకాళి స్వామి , ముస్తఫా , రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ సి హెచ్ నాగేశ్వర్ , సింగరేణి ఆర్ జి – 1 జి ఎం చింతల శ్రీనివాస్ , ఎన్ టి పి సి అధికారి సూర్య నారాయణ , ఆర్ ఎఫ్ సి అధికారి వంశీ కృష్ణ , సి ఐ లు ప్రమోద్ రావు, ప్రసాద రావు , టాన్స్ కో ఎ డి ఇ శ్రీనివాస్ దేవాదాయ శాఖ అధికారులు సుజాతా రెడ్డి , కాంతా రెడ్డి , జాతర కమిటీ ఛైర్మన్ పిన్నిoటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా గోదావరి లో పడవను స్వయంగా ఎం ఎల్ ఎ నడపగా అధికారులు , పాత్రికేయులు ఎక్కి కాసేపు నదీ విహారం చేశారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india