ఎన్టిపిసి పాఠశాలలో చెకుముకి సైన్సు సంబరాలు
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం జనవరి :- 27
చెకుముకి సైన్స్ సంబరాలు- 2023 లో భాగంగా ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎన్ టి పి సి లో జరిగిన చెకుముకి ప్రతిభ పాటల పోటీలో మండల స్థాయిలో ప్రభుత్వ పాఠశాల విభాగం నుంచి కేజీబీవీ రామగుండం విద్యార్థులు కే. కీర్తి, కె.సుధా, కృష్ణవేణి మరియు సాయి శ్వేతలు, ప్రైవేట్ స్కూల్ విభాగం నుంచి శ్రీ చైతన్య హై స్కూల్, ఎన్ టి పి సి విద్యార్థులు అంజికా రాన, యటర్త్ మిగోత్ మరియు విష్ణు స్వరూప్ లు చక్కటి ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు నిర్వాహకులు జన విజ్ఞాన వేదిక ఉమ్మడి రామగుండం కన్వీనర్ గద్దె శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలియజేశారు.జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులకు మెడల్స్ మరియు మెమెంటోలు పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు జయరాజ్, గద్దె శ్రీనివాస్ చేతుల మీదుగా అందించడం జరిగింది.అలాగే మండల స్థాయిలో చక్కటి ప్రతిభ కనబరిచి రెండవ మూడవ స్థానంలో నిలిచినటువంటి విద్యార్థులకు జన విజ్ఞాన వేదిక ద్వారా రూపొందించబడిన విశ్వావతరణం నుండి నరావతరణ వరకు అనే పుస్తకాన్ని బహుమతిగా అందించడం జరిగింది. జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు ఫిబ్రవరి 3వ తేదీన పెద్దపల్లిలో జరిగే జిల్లా స్థాయి పోటీలలో పాల్గొనాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు స్వర్ణలత, అనురాధ కల్పన రాజేశ్వరి శ్రీధర్ ప్రేమ్ కుమార్ తిరుపతి మరియు రమేష్ లు పాల్గొన్నారు.

Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM