ప్రజాస్వామ్య పరిరక్షణే ద్వేయంగా ముందుకు సాగుతాం
మహనీయుల త్యాగాలు మరువలేనివి
జాతీయ జెండాను ఎగరవేసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్
నియోజకవర్గ ప్రజలకు కార్మికులకు, కర్షకులకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం జనవరి :- 26
గోదావరిఖని-: ప్రజాస్వామ్య పరిరక్షణే ద్వేయంగా ముందుకు సాగుతామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్నారు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం తో పాటు గోదావరిఖని ప్రధాన చౌరస్తా, లక్ష్మీ నగర్ లో జాతీయ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం నియోజకవర్గ ప్రజలకు, కార్మికులకు, కర్షకులకు రామగుండం ఎమ్మెల్యే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ మాట్లాడుతూ..మహనీయుల త్యాగాలు మరువలేనివని కొనియాడారు. యువత మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో ప్రజా ప్రభుత్వాన్ని ఇప్పుడిప్పుడే పునర్నిర్మించుకుంటున్నామని అన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న ప్రజలకు ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా చేరే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇప్పటికే ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి రామగుండం నియోజకవర్గ సమస్యలను తీసుకెళ్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజావాణి పేరుతో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నేరుగా ప్రజల నుండే దరఖాస్తులను స్వీకరించి ప్రజా సమస్యల పరిష్కారానికై కృషి చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు, పది లక్షల ఆరోగ్య బీమా సౌకర్యంతో పాటు ఇతర పథకాలను ప్రజల కోసం ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంటా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM








