V1News Telangana

best news portal development company in india

*పెట్రోల్ బంకుల్లో స్తంభించిన ట్రాఫిక్*

SHARE:

*హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ కోసం ఒక్కసారిగా వేలాది వాహనాలు పెట్రోల్ బంకులకు చేరుకోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది.

కేంద్రం తీసుకొచ్చిన హిట్‌ అండ్ రన్‌ వాహన చట్టాన్ని వ్యతిరేకిస్తూ ట్రక్కు డ్రైవర్లు సమ్మె చేపట్టారు. దీంతో నిన్నటి నుంచి బంక్‌లకు పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా నిలిచిపోయింది.

దీంతో పలు పెట్రోల్ బంకు ల్లో నో స్టాక్ అని బోర్దు లు దర్శనమిస్తు న్నాయి. ఆయి ల్ కొరతతో సిటీలో చాలా పెట్రోల్‌ బంక్‌లు మూసివే శారు.

ఈ క్రమంలో పెట్రోల్‌, డీజిల్‌ కోసం సిటీలోని పలు పెట్రోల్ బంకుల ముందు వాహనా లు భారీగా క్యూ కట్టడంతో గంటలకొద్ది రాకపోకలకు అంతరాయం కలిగింది.

ఖైరతాబాద్-లక్డీకపూల్ మార్గంలో దాదాపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఏర్పడింది. దీంతో మెహదీ పట్నం-లక్డీకపూల్ మార్గంలో వాహనాలు స్తంభించిపో యాయి.

పంజాగుట్టు-బేగంపేట మార్గంతోపాటు, బంజారా హిల్స్, కూకట్ పల్లి వంటి పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పలు ప్రాంతాల్లో ట్యాంకర్ల డ్రైవర్లతో పోలీసులు, అధి కారులు చర్చలు జరిపి ధర్నా విరమింపజేశారు.

దీంతో ఆయిల్‌ కంపెనీల్లో పెట్రోల్‌, డీజిల్‌ నింపుకొని ట్యాంకర్‌ డ్రైవర్లు బయల్దే రుతున్నట్లు సమాచారం.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india