ప్రజల వద్దకు ప్రభుత్వ పథకాలను తీసుకు రావడమే ప్రజా పాలన ఒక్క ముఖ్య ఉద్దేశం రామగుండం శాసన సభ్యులు ఎం. ఎస్ . రాజ్ ఠాకూర్
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం డిసెంబర్ 28:- రామగుండం ప్ర
జల వద్దకు ప్రభుత్వాన్ని తీసురావడమే ప్రజా పాలన కార్యక్రమ ముఖ్యోద్దేశ్యమని రామగుండం శాసన సభ్యులు ఎం. ఎస్ . రాజ్ ఠాకూర్ అన్నారు . గురువారం రామగుండం నగర పాలక సంస్థ 29 వ డివిజన్ బాపూజీ నగర్ లో నిర్వహించిన వార్డు సభలో ప్రజల నుండి ధరఖాస్తులను స్వీకరించి ప్రజా పాలన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు . ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా , ప్రజల ముఖాల్లో చిరునవ్వు చూడడమే లక్ష్యంగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. మాట ఇచ్చినట్టుగానే అభయ హస్తం ఆరు గ్యారంటీలలో ఆడబిడ్డలకు ఆర్ టి సి బస్సుల్లో ఉచిత ప్రయాణం , రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ .10 లక్షల వైద్య సహాయం విజయవంతంగా అమలు చేయడం జరుగుతుందని అన్నారు. మిగిలిన గ్యారంటీలను అమలు చేసేందుకే ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మహా లక్ష్మీ , రైతు భరోసా , గృహ జ్యోతి , ఇందిరమ్మ ఇండ్లు , చేయూత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి ధరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని అన్నారు. రేషన్ కార్డు లేని వారి నుండి కూడా ఈ పథకాలకు ధరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని అన్నారు. అవినీతికి తావు లేకుండా అర్హులైన వారందరినీ ఆయా పథకాలకు ఎంపిక చేయడం జరగనున్నoదున మధ్యవర్తులను నమ్మి మోస పోవద్దని హెచ్చరించారు. ఈ పథకాలకు సంబందించి లంచం ఎవరైనా అడిగితే జిల్లా కలెక్టర్ కార్యాలయానికి లేదా నేరుగా తనకే ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే పోలీసుల సహకారంతో వారి భరతం పడతానని అన్నారు.రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రజా పాలన వార్డు సభలు రామగుండం నగరం లో దిగ్విజయం చేసేందుకు మున్సిపల్ కార్పొరేషన్ తరపున అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వార్డు సభలో ధరఖాస్తు ఇవ్వలేక పోయిన వారి నుండి జనవరి ఆరు వరకు మున్సిపల్ కార్యాలయంలో కూడా స్వీకరించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు) అరుణ శ్రీ మాట్లాడుతూ ఒక కుటుంబానికి ఒక ధరఖాస్తు సమర్పిస్తే సరిపోతుందని అన్నారు. ఇదివరకే ఆయా పథకాల ద్వారా లబ్ది పొందుతున్న వారు ధరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదని అన్నారు. కుటుంబ వివరాలతో పాటు ఏ పథకం ద్వారా లబ్ది పొందా లనుకుంటున్నారో ధరఖాస్తు ఫారంలో నిర్ణీత గడి లో టిక్ చేసి కింద వివరాలను పూరించి ఆధార్ , రేషన్ కార్డు జత పరిచి కౌంటర్ వద్ద అప్పగించి రశీదు పొందాలని సూచించారు.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్థానిక కార్పొరేటర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ మురికివాడగా గుర్తింపు పొంది , నిరుపేదలు , దళితులు ఎక్కువగా ఉన్న ఎస్ సి రిజర్వ్డ్ 29 వ డివిజన్ ని మొదటి రోజు ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఎంపిక చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. డివిజన్ ప్రజలు ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ సి హెచ్ నాగేశ్వర్ ప్రజాపాలన కు సంబందించి ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ప్రజాపాలన రామగుండం నియోజకవర్గo ప్రత్యేక అధికారులు మీరజ్ మహమూద్ , డి శ్రీనివాసులు , మెప్మా డి ఎం సి రజనీ , రామగుండం నగర పాలక సంస్థ ఎస్. ఇ . చిన్నా రావు , ఇ ఇ సుచరణ్ , డి ఇ లు జమీల్ అహ్మెద్ , హన్మంతు నాయక్ , ఎ ఇ మీర్ , గోదావరి ఖని వన్ టౌన్ సి ఐ ప్రమోద్ రావు , ఎన్ పి డి సి ఎల్ , ఎ డి ఇ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.కాగా గురువారం రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో 1, 2, 3, 5, 6, 7, 8 డివిజన్ లలో ప్రజా పాలన వార్డు సభలు నిర్వహించి ధరఖాస్తులు స్వీకరించారు. శుక్రవారం ఉదయo 8 గంటల నుండి 12 గంటల వరకు 9,10,11,12 డివిజన్లు మధ్యాహ్నం 2 గంటల నుండి 6 గంటల వరకు 13, 14, 15, 16 డివిజన్ లలో నిర్వహించనున్నారు.
Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM








