V1News Telangana

best news portal development company in india

నేడు కలెక్టర్ తో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం*

SHARE:

హైదరాబాద్‌:డిసెంబర్ 24

ప్రజాపాలనపై కాంగ్రెస్‌ సర్కార్‌ దృష్టి సారించింది. జనం సమస్యల పరిష్కా రానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ దిశగా కలెక్టర్లకు దిశా నిర్దేశం చేస్తున్నారు.

*సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన సమావేశమయ్యారు*

100 రోజుల్లో 6 హామీల అమలుకు పాలనా యంత్రాంగాన్ని సంసిద్ధం చేసేందుకు వీలుగా ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లడమే ప్రధాన అజెండాగా భేటీ జరుగుతోంది.ఈ సమా వేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో పాటు, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు కూడా పాల్గొన్నారు.

భారాస పదేళ్ల పాలనపై చర్చించడంతోపాటు సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరుపు తున్నారు. ప్రజావాణిని జిల్లా, డివిజన్‌, మండల, గ్రామ స్థాయుల్లో పకడ్బం దీగా నిర్వహించడానికి చేపట్టాల్సిన కార్యాచరణపై కలెక్టర్ల ద్వారా సమాచారం తీసుకోనున్నారు.

*ఆరు గ్యారంటీల అమలుపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వ నున్నారు*

ప్రజాపాలన ప్రధాన ఎజెం డాగా ఉన్నప్పటికీ అనుబం ధంగా పై నాలుగు కీలక అంశాలపై దృష్టి కేంద్రీకరిం చనున్నట్లు తెలిసింది. ఇప్పటికే రెండు గ్యారెంటీ లను అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం మార్చి 17వ తేదీలోగా మిగిలిన వాటిని అమలుచేయాలనిలక్ష్యంగా పెట్టుకున్నది.

*అర్హతలపైనే ఫోకస్*

ఆరు గ్యారెంటీల అమలుకు భారీ స్థాయిలో నిధులు ఖర్చవుతాయని ఆర్థిక నిపుణులతో పాటు అధికారులూ అంచనా వేశారు. వాటి అమలుకు అవసరమైన వనరులను సమీకరించుకోవడంతో పాటు అర్హులైన వారిని గుర్తించడం ఇప్పుడు కీలకంగా మారింది.

గ్యారెంటీలకు రూపకల్పన చేసే సమయంలోనే ఏ మేరకు నిధులు అవసరం అవుతాయనే దానిపై కాంగ్రెస్ లోతుగా అధ్య యనం చేసింది. మహిళ లకు ప్రతి నెలా రూ.2,500 ఆర్థిక సాయం ఇవ్వను న్నట్లు మహాలక్ష్మి స్కీమ్ గ్యారంటీ లో పేర్కొన్నందున అర్హతలను ఫిక్స్ చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

ఏ వర్గానికి చెందిన మహి ళలకు అమలు చేయాల న్నది చర్చనీయాంశంగా మారింది.కలెక్టర్లతో కాన్ఫ రెన్స్ నిర్వహించనున్న సీఎం వారితో అభిప్రాయాలు తీసుకోనున్నారు.

చాలా పథకాలకు లబ్ధి దారుల ఎంపికలో రేషన్ కార్డులు కీలకంగా ఉన్నా యి. దీన్ని దృష్టిలో పెట్టు కుని ప్రస్తుత ప్రభుత్వం కూడా గ్యారెంటీల పేరుతో అందుకునే సాయానికి నిర్దిష్టమైన అర్హతలను ఫిక్స్ చేయడం అనివార్యమవు తున్నది.

ఇందులో భాగంగానే రేషన్ కార్డుల కోసం ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు, వాటి లో అప్రూవ్ అయినవి, ఇంకా పరిశీలనలో ఉన్నవి, కొత్తగా దరఖాస్తులను ఆహ్వానించడం.. తదితర అంశాలన్నింటిపైనా కలెక్టర్ల నుంచి సీఎం ఫీడ్‌బ్యాక్ తీసుకుని స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం.

అనేక పథకాలకు రేషన్ కార్డు కనీస అర్హతగా ఉన్నందున ఈ అంశాన్ని కొలిక్కి తేవడం తప్పని సరిగా మారింది…

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india