బేల్ తరోడా లో ఘనంగా అయ్యప్ప పడిపూజ
తానూర్,డిసెంబర్ 24( ): అయ్యప్ప నామస్మరణతో బేల్ తరోడా మార్మోగింది,తానూర్ మండలంలోని బెల్ తరోడ క్రేషియర్ వద్ద తిర్మల్ రావు ఆధ్వర్యంలో సునీల్ గురు స్వామి ఘనంగా మహాపడి పూజమహోత్సవం నిర్వహించారు,
[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]

ఆదివారం పూజా కార్యక్రమంలో భాగంగా ముందుగా వినాయకుడు, కుమారస్వామి,అయ్యప్ప స్వాముల చిత్రపటాలతో అందమైన పూజా అలంకరణ నిర్వహించారు, ఇరుముడి కట్టిన ప్రతి స్వామి అయ్యప్ప స్వామి యాత్రను పూర్తి చేయాలని బ్రహ్మచర్యంతో నియమ నిష్ఠలతో స్వీకరించిన ప్రతి స్వామికి హరిహర పుత్రుని ఆశీస్సులు ఉంటాయని అన్నారు,అయ్యప్ప స్వాములకు భిక్షను ఏర్పాటు చేశారు,పెద్ద ఎత్తున అన్నదానం ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు కూడా మహాప్రసాదాన్ని అందుకున్నారు,ఈ మహోత్సవానికి మహారాష్ట్ర నుండి,చుట్టుపక్కల మండలాల నుండి గురు,పెరు,కత్తి, కన్నె,మణికంఠ స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు,ఈ పడిపూజలో తానూర్,ఎల్వి,బెల్ తరోడా,భోసి మహలింగి,భైంసా, ధర్మాబాద్,భోకర్ గురు స్వాములు మౌనగౌడ్ గురు స్వామి,పుండలిక్, ఎల్లప్ప,చిన్న,పోశేట్టి,రమేష్,సంతోష్,చారి గురు స్వాములు,స్వాములు, అయ్యప్పస్వామి భక్తులు,
మహిళలు,పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








