*తాలూకా ప్రజలకు అందుబాటులో డయాలసిస్ కేంద్రo*
*ప్రారంభించిన ఎమ్మెల్యే పవార్ రామారావు*
నిర్మల్, డిసెంబర్ 24(వి1 న్యూస్ తెలుగు): ముధోల్ తాలూకా ప్రజలకు డయాలసిస్ కేంద్రము ఆదివారం నుండి అందుబాటులో ఉంటుందని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు బైంసా పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ఐదు పడకల డయాలసిస్ కేంద్రాన్ని ఎమ్మెల్యే పవర్ రామారావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాలూకాలో డయాలసిస్ వ్యాధితో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులు చికిత్స నిమిత్తం దూర ప్రాంతాలైన నిజామాబాద్, నిర్మల్ వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని ,ప్రజలను దృష్టిలో ఉంచుకొని, భైంసా ప్రాంతీయ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రంను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. డయాలసిస్ యొక్క కేంద్రం యొక్క సేవలను బాధితులు సద్వినియోగము చేసుకోగలరని కోరారు అనంతరం నూతన మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో హాస్పిటల్స్ సూపర్డెంట్ కాశీనాథ్, ఆస్పత్రి సిబ్బంది, మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
*డయాలసిస్ కేంద్రము ఏర్పాటు సంతోషకరం*
*డయాలసిస్ బాధితులు*
ముధోల్ గ్రామంలో నివసిస్తున్న కొందరు బాధితులు యాబై కిలోమీటర్ల ప్రయాణం చేయి డయాలసిస్ కోసం వారంలో రెండుసార్లు నిర్మల్ కి వెళ్లి డయాలసిస్ చేసుకుంటున్నామని, డయాలసిస్ కేంద్రం దగ్గర లేకపోవడం వలన ఖర్చుతోపాటు మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ, కలిగేదని అన్నారు.బైంసా ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రము ఏర్పాటుతో కష్టతరం కాకుండా చేసుకోవచ్చని సంతోషం వ్యక్తపరిచారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








