హైదరాబాద్:డిసెంబర్ 24
క్యాబ్ డ్రైవర్లు,ఫుడ్ డెలవరీ బాయ్‌లు,ఆటో డ్రైవర్ల కోసం రూ.5 లక్షల యాక్సిడెంటల్ పాలసీ’ తీసుకురావడంతోపాటు ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
అదేవిధంగా క్యాబ్ డ్రైవర్ల కోసం ఓలా మాదిరిగా టీ హబ్ ద్వారా ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకు వస్తామని చెప్పారు. క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్‌లు, ఆటో డ్రైవర్ల (గిగ్ వర్కర్లు) సమస్యలను తెలుసుకోవడానికి శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన సమావే శంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వారి సమ స్యలను అడిగి తెలుసు కున్నారు.
సామాజిక రక్షణ కల్పిం చడంలో తమ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసంఘటిత కార్మికుల ఉపాధి, సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామని తమనేత రాహుల్ గాంధీ మాట ఇచ్చారని గుర్తు చేశారు.
ఆ క్రమంలో విధాన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇందుకోసం రాజస్థాన్‌లో చేసిన చట్టాన్ని అధ్యయనం చేసి వచ్చే బడ్జెట్ సమా వేశాల్లో సమర్ధవం తమైన చట్టాన్ని ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు.
సంస్థలు కూడా కేవలం లాభాపేక్ష మాత్రమే చూడకుండా.. కార్మికులు, ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి పెట్టాలి. గివ్ అండ్ టేక్ పాలసీని పాటించని ఎంత పెద్ద సంస్థలపైనైనా చర్యలు తీసుకోవడానికి వెనుకాడ బోం. 4 నెలల క్రితం స్విగ్గి బాయ్ కుక్క తరిమితే భవనంపై నుంచి పడి మృతి చెందాడు.
అప్పటి ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా సాయం అందిస్తారని ఆనాడు చూశా.. కానీ ప్రభుత్వం ఏమీ చేయలేదు. ప్రభు త్వాలు ఇలాంటి సంఘ టనలు జరిగిన సమయంలో మానవత్వంతో వ్యవహ రించాలి. అందుకే ఆ కుటుంబం వివరాలు సేకరించి సీఎం సహాయనిది నుంచి ఆ కుటుంబానికి రూ. 2 లక్షలు అందించాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన గ్రామ సభలు నిర్వహి స్తున్నామని అక్కడ దరఖాస్తుల్లో మీ వివరాలు అందించండని క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్‌లు, ఆటో డ్రైవర్లకు సీఎం శ్రీ రేవంత్ రెడ్డి సూచించారు. డిజిటల్, మాన్యువల్ ఏ రూపంలో నైనా దరఖాస్తులు ఇవ్వొచ్చు నని చెప్పారు.
ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి గ్రామ సభలు నిర్వహిస్తామని… ప్రజా వాణిలో వచ్చిన దరఖాస్తులను అన్నింటినీ పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఏఐసీసీ సెక్రెటరీలు రోహిత్ చౌదరి, మన్సూర్ అలీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








