మావోయిస్టులు రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు.
దీంతో పోలీసులు తెలంగాణ- ఛత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు..
దండ కారణ్యాన్ని భద్రత బలగాలతో జల్లెడ పడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా ఆంధ్ర ప్రదేశ్ లో మావోయిస్టులు విధ్వసం సృష్టించారు. అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో వీరాపురం దగ్గర నిన్న రాత్రి వాహనాలపై మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు.
ఒక ఆర్టీసీ బస్సు రెండు ట్రక్కులు రెండు కార్లకు నిప్పు పెట్టారు. రేపు తాము ఇచ్చిన భారత్ బంద్ పిలుపుని విజయవంతం చేయాలంటూ కరపత్రాలను మావోయిస్టులు వదిలి వెళ్లారు.
అయితే మావోయిస్టుల డిమాండ్స్ పై ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు..
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








