V1News Telangana

best news portal development company in india

తెలంగాణలో పెరుగుతున్న కరోనా: జర జాగ్రత్త*

SHARE:

*తెలంగాణలో పెరుగుతున్న కరోనా: జర జాగ్రత్త*

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్త మైంది. కరోనా వ్యాప్తి చెంద కుండా ముందస్తు చర్యలు చేపట్టింది.

ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ సిబ్బందికి మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఆయన వైద్యాశాఖాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

జిల్లా దవాఖానలు, కమ్యూ నిటీ హెల్త్‌ సెంటర్లు, బస్తీ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్‌ పరీక్షలు, చికిత్స పరికరాలు, ఔషధాలు సిద్ధం చేసుకోవా లని సూచించారు. ఎకడైనా కొరత ఉంటే టీఎస్‌ఎంఎస్‌ ఐడీసీ నుంచి సమకూర్చు కోవాలని చెప్పారు.

మాక్‌ డ్రిల్‌ను వెంటనే పూర్తిచేయాలని, దవా ఖానల సన్నద్ధతకు సం బంధించిన వివరాలను కేంద్రానికి పంపాలని ఆదేశించారు.

ఇన్‌ఫ్లుయెం జా మాదిరిగా శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దవాఖానలు, జిల్లా స్థాయిలో విభాగాధి పతులు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం విధిగా నమూనాలను ఉప్పల్‌లోని సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింట్స్‌ అండ్‌ డయాగ్నోస్టిక్స్‌ సీడీఎఫ్‌డీ,కు పంపాలని తెలిపారు.

*శనివారం మరోసారి సమీక్ష నిర్వహిస్తానని మంత్రి వెల్లడించారు*

తొమ్మిది యాక్టివ్‌ కేసులు
రాష్ట్రంలో ప్రస్తుతం తొమ్మిది యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు మంత్రి దామోదర రాజ నర్సింహకు అధికారులు తెలిపారు. బాధితుల్లో ఎవరికీ తీవ్రమైన లక్షణాలు లేవని, వారంతా ఇంట్లోనే ఐసోలేషన్‌లో కోలుకొంటు న్నారని చెప్పారు.

బుధవారం 319 కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, ఐదుగురికి పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. అంతకుముందు..కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మండవీయ అధ్యక్షతన జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి దామో దర రాజనర్సింహ పాల్గొ న్నారు.

రాష్ట్రంలో కరోనా కొత్త వెరియంట్‌ జేఎన్‌-1 మహమ్మారి కట్టడికి ముందస్తు చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు…..

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india