V1News Telangana

best news portal development company in india

పాఠశాల కళాశాలకు వెళ్లే విద్యార్థులకు బస్సుల లో అవస్థలు తప్పడం లేదు

SHARE:

బోధన్, బాన్సువాడ
పాఠశాలలకు కళాశాలలకు ప్రతిరోజు బస్సులలో వెళ్లి వచ్చే విద్యార్థులకు అవస్థలు, నానా హైరానా పడాల్సిన పరిస్థితి నెలకొనడం దారుణం అని పలువురు ఆరోపిస్తున్నారు. పాఠశాలకు ,కళాశాలకు వెళ్లి రావాలంటే బస్సులలో తిప్పలు పడాల్సిన అవసరం ఉందని, ప్రమాదమని తెలిసినా పాఠశాలకు, కళాశాలకు టైం అవుతుంది కంపల్సరి వెళ్లాల్సిందే నన్న టెన్షన్లో విద్యార్థులు ప్రయాణం చేసి వారి వారి గమ్యానికి చేరుకుంటున్న పరిస్థితి నెలకొంటుంది.

ప్రయాణం ప్రమాదమని తెలిసినా పాఠశాలకు, కళాశాలకు అష్ట కష్టాలు పడి బస్సులలో నరకయాతన పడుతూ వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఇకపోతే వర్ని మండలం అంబం, ఆర్ గ్రామపంచాయతీ కోటయ్య క్యాంపు గ్రామంలో ఉన్న మోడల్ పాఠశాల వివిధ హాస్టల్లకు వెళ్లే విద్యార్థులకు ఒకవైపు రోడ్డు దుస్థితి బాగు లేని వైనం, గుంతలు మయంగా ఆయన రోడ్డు మరోవైపు బస్సు సౌకర్యం లేక విద్యార్థులు కాలినడకన అదేవిధంగా ఇరుకు బస్సులలో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని విద్యార్థులతో పాటు ప్రజలు వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చదువుకోవాలంటే నానా కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి విద్యార్థులకు నెలకొంటున్న పరిస్థితి దారుణమని ప్రజలు మండిపడుతున్నారు. ఓవైపు పాఠశాలకు కళాశాలకు వెళ్లే ప్రధాన రహదారులు బాగు లేకపోవడం మరోవైపు బస్సు సౌకర్యం లేకపోవడం ఉన్న బస్సు సౌకరం కూడా ఇరుకుగా ఉండడం నరకప్రాయంగా ప్రయాణించడం వంటి పరిస్థితులు విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్న పరిస్థితులు ఉన్నాయి అని ప్రజలు ఆరోపిస్తుండ్రు. పాఠశాలకు, కళాశాలకు వెళ్లి చదవాలంటే విద్యార్థులకు నరకయాతన తప్పడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india